సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా..
కర్ణాటక సీఎం బీఎస్ యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. అంతకుముందే ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. అధిష్టానం ఆదేశంతోనే ఆయన రాజీనామా చేశారు. రెండేళ్ల పాలన వేడుకల్లో ఆయన తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఇన్నిరోజులు ప్రభుత్వాన్ని బాగా నడిపానన్న సంతృప్తి ఉందనీ ఆయన వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం గవర్నర్ ను కలిసి రాజీనామాలేఖ అందజేశారు. అయితే యడ్డీ వారసుడిగా పాలనాపగ్గాలు చేపట్టేదెవరనేదానిపై చర్చ నడుస్తోంది. హోంమంత్రి బసవరాజు బొమ్మై పేరు ప్రధానంగా వినిపిస్తోంది. యెడ్డీ సైతం బొమ్మై పేరునే ప్రతిపాదించినట్టు పార్టీవర్గాలంటున్నాయి.

file photo : Yediyurappa