గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కి గుండెపోటు వచ్చిందని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్నికల ఫలితాలు మీద సమీక్ష జరుగుతున్నప్పుడు కుప్ప కూలిపోవడంతో.. గుండెపోటు అంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇదేమీ గుండెపోటు కాదని, చిన్నపాటి నీరసం అని నాని వర్గీయులు చెప్తున్నారు.
ఎన్నికలు పూర్తయినప్పటినుంచి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి దగ్గర నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో మూడేళ్లు మంత్రిగా ఆ తర్వాత మాజీ మంత్రిగా పాపులారిటీ ఉంది అంతకుమించి తెలుగుదేశం మీద చంద్రబాబు మీద తిట్లతో తో విరుచుకుపడతారు కాబట్టి అప్పట్లో బూతుల మంత్రి అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవారు.
గుడివాడలో 30 ఏళ్లుగా వరుసగా కొడాలి నాని గెలుస్తూ వస్తున్నారు. అందుచేత అక్కడ ఎలాగైనా నానిని ఓడించాలని తెలుగుదేశం విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఈ సీటుని నిలబెట్టుకోవాలని ఇటు కొడాలి నాని కూడా గట్టిగా ప్రయత్నం చేశారు.
అంతవరకు బాగానే ఉంది ఈ లోక గుడివాడ గెలుపు మీద బెట్టింగులు జోరందుకున్నాయి ఒక మాటలో చెప్పాలంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్ సీటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీటు కన్నా గుడివాడ సీట్ మీదనే ఎక్కువ బెట్టింగ్ నడుస్తున్నాయి దీనిని బట్టి గుడివాడ సీటు డిమాండ్ అర్థమవుతోంది.
ఎన్నికల తర్వాత నుంచి కొడాలి నాని చాలా వరకు ఇంటి దగ్గరే ఉంటున్నారు గురువారం నాడు కూడా ఇంటిదగ్గర నందివాడ మండల వైసీపీ నాయకులతో మాట్లాడుతుండగా సోఫాలో కుప్పకూలిపోయారు.
వెంటనే అప్రమత్తమైన గన్ మెన్..సపర్యలు చేసి, వైద్యులను పిలిపించారు.
ఇంట్లో నుండి పార్టీ నాయకులను పంపించేసి , కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. డాక్టర్లు
ప్రధమ చికిత్స చేసిన అనంతరం సెలైన్ పెట్టారు . ఇది గ్యాస్ పెయిన్ మాత్రమే అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు అంటున్నారు. ఈలోగా హైదరాబాద్లో ఉంటున్న కొడాలి నాని కుటుంబ సభ్యులు గుడివాడకు బయలుదేరారు.
సోషల్ మీడియాలో మాత్రం కొడాలి నాని కి గుండెపోటు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గుడివాడలో ఓటమి ఖాయం అని తెలియడంతో కొడాలి నాని బెంగ పెట్టుకున్నారని ఒక వర్గం వాదిస్తుంటే,, అనారోగ్యం వచ్చినప్పుడు ఇట్లాంటివి మాట్లాడకూడదు మరొక వర్గం వాదిస్తోంది.