ఆ రోజు అంటే 2014 సం.ఆగస్ట్ 3వ తేదీ
“ఇసిల్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లేవంట ” తీవ్రవాద మూకలు ఉత్తర ఇరాక్ లో సింజార్ అన్న ప్రదేశంలో నివసిస్తున్న ఈ యేజిదిల సమూహం పై విరుచుకు పడ్డారు. ఈ యజిదిలు అప్పటివరకు కుర్దిష్ సైనికుల రక్షణలో వున్నారు. ఇసిస్ వారు తమ వెబ్ సైట్ లో పెట్టిన వివరాలు ప్రకారం ఆ ఒక్క రోజే 2 లక్షల మంది ఏజిదిలు తమ స్వస్థలం విడిచి పారిపోయారు. 50 వేల మంది నీరు, నీడ దొరకని కొండల్లోకి పారిపోయారు. యునైటెడ్ నేషన్స్ లెక్కల ప్రకారం ఈ ఇస్లామిక్ ఇసిల్ ఉగ్రవాద మూకల చేతిలో 5 వేల మంది యేజిడి పురుషులు చంపబడ్డారు, 7 వేల నుండి 11 వేలు వరకు స్త్రీలను, ఆడపిల్లలను సెక్స్ బానిసలుగా, బందీలుగా పట్టుకుపోయారు.
మరీ దారుణం ఏమిటంటే ఈ యేజిదిలు అప్పటి వరకు తమతో జీవిస్తున్న తమ శ్రేయోభిలాషులు అని భావించిన సున్నీలు ఇసిస్ తీవ్రవాద మూకలతో చేతులు కలిపి వీరిపై దాడులు చేయడం. అది వీరు ఊహించలేదు. దానిని మానసికంగా తట్టుకోలేకపోయారు.(కాశ్మీరీ పండితులకు కూడా ఇదే అనుభవం ఎదురు అయింది).
ఈ ఇసిస్ మూకలు యేజిది స్త్రీలను, ఆడపిల్లలను పురుషుల నుండి వేరు చేసి వారు కన్యలో కాదో తమ వద్ద వున్న గైనకాలజిస్ట్ లచే పరీక్షలు చేయించి నిర్ధారణ చేసేవారు. గర్భవతులకు బలవంతపు అబార్షన్లు చేయించారు. ఇలా వేరు చేసిన స్త్రీలను, ఆడపిల్లలను ఈ ఇస్లామిక్ ఉగ్రవాద మూకలు సామూహిక బలాత్కారాలు చేసి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన “బానిస బజార్లలో” వేలం వేశారు.. అంతే కాక వాట్స్ అప్, ఫేస్ బుక్, టెలిగ్రాం అప్స్ , బ్లాక్ సైట్స్ ద్వారా కూడా ఈ వేలం పాటలు సాగించారు. ఏ బానిసలు ఎంత రేట్ అన్న రేట్ లిస్ట్ లు కూడా పెట్టేవారు. ఈ దారుణ హింస భరించలేక చాలా మంది ఆడపిల్లలు ఆత్మహత్య లు చేసుకున్నారు. మొండికేసిన స్త్రీలను పారిపోకుండా ఇనుప ఊచల బోనుల్లో బంధించి తగలెట్టారు.
వాళ్ళ కర్కసత్వానికి గురి అయిన స్త్రీలు, ఆడపిల్లలు ఈ రోజుకూ బతికి వుండి వారు అనుభవించిన నరక వేదన వర్ణిస్తూ వుంటే భూమి మీద మనుషులు మధ్య యేనా మనం బతుకుతున్నది అని అనుమానం కలుగుతుంది.
ఒక స్త్రీని పూర్తిగా 3రోజులు పస్తు పెట్టి ఆ తరువాత తిండి పెట్టి, తిన్నాక నువ్వు తిన్నది నీ సం.వయసు కల కొడుకు మాంసమే అని చెప్పారు అంటే ఎంత అమానుషంగా ఈ ఎజిదిలను హింసించారో తెలుస్తుంది. (ఈ సంఘటన ఇరాక్ పార్లమెంట్ కి చెందిన వియన్ దాఖిల్ చే 2017లో చెప్పబడింది).
ఇతర మత విశ్వాసం అంటే తక్కువ వారు అనే ఏహ్య భావనే ఈ మారణ కాండకు మూలం. ఈ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ తమ డిజిటల్ మేగజైన్ “దాబిక్” లో పేర్కొంటూ ఇలా దొరికిన స్త్రీలను బందీలుగా పట్టుకోవడానికి ఇస్లాం మతం అనుమతి ఇస్తుంది అని ” హాధిత్” ని కోట్ చేసింది.
2014లో జరిగిన ఈ నరమేధం లో కనిపించకుండా పోయిన 2868 యేజిధీ స్త్రీలు, ఆడపిల్లలు, చిన్నపిల్లల గురించి ఇంకా గాలిస్తున్నారు. వీరిలో కొంత మంది ఇసిస్, మరికొంత మంది దాయిష్ అనే మరో ఉగ్రవాద సంస్థ చేతిలో చనిపోయారు అని భావించినా ఇంకా మిగిలిన వారు బహుశా ఇస్లామిక్ తీవ్రవాదుల చేతుల్లో బందీలుగా సిరియా, టర్కీ దేశాల్లో ఉన్నారేమో అని అనుమానం. ఎందుకంటే ఈ మధ్యనే ఒక డార్క్ వెబ్ సైట్ లో 7 సం.ల ఏజీధి బాలికను అమ్మకానికి ప్రకటన ఇచ్చిన ఇస్లామిక్ ఉగ్రవాదిని అరెస్టు చేశారు. ఈ ఇసిస్ తీవ్రవాదులకు ఆర్థిక, నైతిక మద్దతు ఇస్తూ తమ దేశంలో వీరికి రక్షణ ఇస్తున్నట్లు టర్కీ అధ్యక్షుడు ఏర్డాజెన్ ఆరోపణలు ఉన్నాయి.
ఉత్తర ఇరాక్‌లో ఎజిది స్త్రీలతో జరిపిన డజన్ల కొద్దీ ఇంటర్వ్యూల ఆధారంగా ఆమ్నెస్టీ ఒక రిపోర్ట్ తయారుచేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం కొంతమంది పిల్లలు ఈ దాడుల్లో అవయవాలను కోల్పోయారు, అత్యాచారానికి గురైన కొంతమంది అమ్మాయిలు భవిష్యత్ లో ఇక శాశ్వతంగాపిల్లలను కనలేరు. ఇసిస్ దుండగులు వల్ల కలిగిన శిశువులను కలిగి ఉన్న బానిసలైన యాజిదీ మహిళలకు విదేశాలలో తమ పిల్లలతో సహా పునరావాసం కల్పించాలని ఆమ్నెస్టీ పిలుపునిచ్చింది.
ఈ క్రింద ఫోటోలు చూస్తే చాలు.. ఆ ముష్కరులు ఎంత పైశాచికంగ ప్రవర్తించారో తెలుస్తుంది.
ఇంకో విషయం ఏమిటంటే మన దేశంలో ఎప్పుడూ మానవ హక్కులు స్త్రీ హక్కులు అని గొంతుంచించుకునే వామ పక్ష మేధావులు కానీ హక్కుల పోరాట యోధులు కానీ ఈ యేజిది మారణకాండ గురించి ఒక వ్యాసం రాయడం కానీ సెమినార్ ఏర్పాటు చెయ్యడం కానీ చెయ్యలేదు. కారణం?
..ఆ కారణం మూడో భాగంలో చదవండి.
….చాడా శాస్త్రి. ..