విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణ పర్యటనకు వచ్చారు. కాసేపటి క్రితమే బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు ఇవాళ హైదరాబాద్ నగరం వేదికగా మారింది. ఒకవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని మోదీ రాక, మరోవైపు యశ్వంత్ సిన్హా సైతం నగరంలో పర్యటించి ప్రచారం చేయనున్నారు. సీఎం కేసీఆర్ సైతం ఈ ప్రచారంలో పాల్గొనున్నారు. సీఎం కేసీఆర్ సిన్హాకు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో సిన్హా హైదరాబాద్ చేరుకున్నారు. టీఆర్ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీగా తరలి వచ్చి రాష్ట్రపతి అభ్యర్థికి ఘన స్వాగతం పలికాయి.
ప్రధాని మోదీ హైదరాబాద్కు గత ఆరునెలలో మూడు సార్లు వచ్చారు. ఏ సందర్భంలోనూ ప్రొటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ ప్రధానికి ఆహ్వానం పలకలేదు. యశ్వంత్ సిన్హాకు మద్ధతు ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆయన వెంట వందల మంది కార్యకర్తలతో కలిసి నిర్వహిస్తున్న బైక్ ర్యాలీలో పాల్గొంటుడడం, ప్రచారసభలో ప్రసంగిస్తుండడం ఆసక్తికరంగా మారింది.