వావ్.. మీ పాత కార్లను తుక్కు చేస్తే బంపర్ ఆఫర్.. కండిషన్స్ అప్లై..!
మీ ఇంట్లో పాత కారు ఉందా..? అయితే ఈ న్యూస్ మీ కోసమే. ఇటీవల కేంద్ర బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాత కార్లకు సంబంధించి కొత్త పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నూతన పాలసీ ప్రకారం.. ఇకపై 20 ఏళ్లు దాటిన వాహనాలను తక్కు చేయాల్సిందే. అంతే కాదు.. ఇకపై రోడ్లపై తిరిగి పాత వాహనాలను మెల్లిగా తొలగించేందుకు మరికొన్ని చర్యలు తీసుకునేందుకు కేంద్రం రెడీ అయ్యింది. 8 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలు,15 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలపై గ్రీన్ టాక్స్ వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త పాలసీతో పాత వాహనాలు రొడ్డెక్కడం ఇకపై కుదరదు. అయితే పాత కార్లు కలిగి ఉన్న వాహనదారులకు ఓ బంపర్ ఆఫర్ త్వరలోనే ప్రకటించనుంది కేంద్రం.కొత్త పాలసీ ప్రకారం.. పాత కారును తక్కు చేస్తే అందుకు ప్రతిఫలంగా కొత్త కారు కొనే సమయంలో బంపర్ ఆఫర్లను ప్రకటించబోతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రజలకు తెలియజేస్తామని గడ్కరీ ప్రకటించారు.