ప్రపంచంలోనే అతిపెద్ద శివుడి విగ్రహావిష్కరణ ఇవాళ జరిగింది. 369 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని రాజస్థాన్‌లోని రాజ్ సమందర్ జిల్లాలో ఉదయ్ పూర్ సమీపంలోని నాథత్వారాలో నిర్మించారు. అత్యంత ఎత్తులో కొలువుదీరిన శివుడి ప్రతిమ 20 కిలోమీటర్ల దూరంనుంచే కనిపిస్తుంది. గుజరాత్‌కు చెందిన ఆధ్యాత్మికవేత్త… మొరారీ బాపు ఆధ్వర్యంలో ఈ నిర్మాణం సాగింది. రాజ్‌సమంద్ ముఖ్యమంత్రి గెహ్లాట్, అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి సహా పలువురు ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్ పనులకు పదేళ్లు పట్టింది. ప్రపంచంలోనే ఐదో ఎత్తైన విగ్రహం ఇది.
నాథద్వారాలోని గణేష్ టేక్రిపై ఉన్న కొండపై ధ్యానభంగిమలో ఉన్న శివుడి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. రాత్రిపూట మరింత కనువిందు చేసేలా లైటింగ్ ఏర్పాటు చేశారు. ఎత్తైన శివవిగ్రహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజస్థాన్ టూరిజం సైతం ప్రమోట్ చేస్తోంది. 2012లో ప్రణాళిక సిద్ధం చేసినప్పుడు వాళ్లు అనుకున్న ఎత్తు… 251 అడుగులు. కానీ నిర్మాణ సమయంలో ఎత్తును మరో వంద అడుగులు పెంచాల్సి వచ్చింది. ఇక శివుడి జటాఝూటంలో గంగా ప్రవాహం కోసం మరింత ఎత్తు పెరిగి… చివరకు విగ్రహం 369 అడుగులైంది.
https://twitter.com/my_rajasthan/status/1577157216590655488?s=20&t=NPa1WO-HNvtvojKYdCBDLw
ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఐదు శివుడి విగ్రహాల్లో ఇది మొదటిది..విశ్వాసవిగ్రహంగా దీనికి పేరుపెట్టారు. నేపాల్‌లోని కైలాష్‌నాథ్ మహాదేవ్ మందిరం,. కర్ణాటకలోని మురుడేశ్వర మందిరం, తమిళనాడులోని ఆదియోగి మందిరం, మంగళ్ మారిషస్‌లో మహాదేవ్ విగ్రహాలు ఎత్తైనవని.
విగ్రహంలో ఈ విగ్రహంలో లిఫ్టులు, మెట్లు, మందిరాలు నిర్మించారు. 3000 టన్నుల ఉక్కు, ఇనుము, 2.5 లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీటు, ఇసుకను స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ కోసం వినియోగించారు. 250 కి.మీ వేగంతో వీచే గాలులను సైతం తట్టుకోగలదు. మిరాజ్ గ్రూప్ చైర్మన్ మదన్ పలివాల్ రూపొందించారు. నిర్మాణ రూపకల్పనను స్కెలిటన్ కన్సల్టెంట్స్ అందించారు. అసలు విగ్రహం పని 2016 ప్రారంభంలో ప్రారంభమైంది.