దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో 10 మంది పిల్లలకు జన్మనిచ్చి ప్రపంచ రికార్డు సృష్టించింది.
37ఏళ్ల గొసియామె థమారా పదిమందికి జన్మనిచ్చింది. వారిలో ఏడుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ముందు ఆమగ కడుపులో ఆరుగురు పిల్లలు ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు.స్కానింగ్ లో ఎనిమిది మంది పిల్లలున్నారని తేల్చారు.కానీ ఆమె పదిమందికి జన్మనిచ్చింది. వైద్యులు ధ్రువీకరిస్తే ప్రపంచ రికార్డు ఆమె సొంతమవుతుంది. గతనెలలో మాలికి చెందిన హలీమా సిస్సెకు ఒకే కాన్పులో తొమ్మిది మంది పిల్లలు పుట్టారు.
అయితే 10 మంది పిల్లలు పుడతారనే విషయం కాన్పుకు ముందు తెలియలేదు. డాక్టర్లు తీసిన స్కానింగ్ రిపోర్టుల్లో మొదట ఆరుగురు పిల్లలు పుడతారని చెప్పారు. మళ్లీ కొన్ని స్కానింగ్‌ల తర్వాత 8 మంది పిల్లలు పుడతారని చెప్పారు. అయితే వైద్యుల రిపోర్టులను అధిగమించి ఆమె 10 మంది పిల్లలకు జన్మనివ్వడం గమనార్హం..