ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవ తో 84 కోట్ల రూపాయల విలువైన కళాఖండాలు భారత్ కు తిరిగి వస్తున్నాయి. అమెరికా లోని డిస్ట్రిక్ట్ అటార్నీ ఆల్విన్ బ్రాగ్ సమక్షంలో బదిలీ జరిగింది. ఈ కళాఖండాలను భారత కాన్సులేట్ జనరల్ సీనియర్ అధికారి మనీష్ కుల్హారీ అధికారికంగా స్వీకరించారు. మొత్తం 1440 కళా ఖండాలు భారత్ కు తీసుకొని వస్తున్నారు.
1980లలో మధ్యప్రదేశ్‌లోని ఒక ఆలయం నుంచి ఇసుకరాతి నర్తకి విగ్రహం,1960లలో రాజస్థాన్‌లోని తానేసర-మహాదేవ్ ఆలయం నుండి దోచుకొన్న తానేసర్ మా విగ్రహం తిరిగి వచ్చిన కళాఖండాలలో ముఖ్యమైనవి. డ్యాన్సర్ విగ్రహాన్ని మొదట్లో స్మగ్లర్లు రెండు భాగాలుగా కట్ చేసి, ఫిబ్రవరి 1992లో లండన్ నుండి న్యూయార్క్‌కు రవాణా చేశారు, చివరికి మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌కు అమ్మేశారు. ఇదే మాదిరిగా అనేక కళాఖండాలను స్మగ్లర్లు కొట్టేసి, ఇతర దేశాల్లో అమ్మేశారు. వీటి మీద దర్యాప్తు ద్వారా ఈ కళాఖండాలను రికవరీ చేశారు.
ఈ కళాఖండాల రికవరీ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవ తీసుకొన్నారు.
భవిష్యత్ తరాలకు భారతదేశపు గొప్ప వారసత్వాన్ని అందించేందుకు వీలవుతుంది.