ఫ్రెషర్లపై వేటు వేసింది విప్రో. శిక్షణ తరువాతకూడా పనితీరు మెరుగుపర్చుకోని 452 మందిని తొలగిస్తున్నట్టు సంస్థ తెలిపింది. పనితీరు విషయంలో విప్రో ఉన్నత ప్రమాణాలు పాటిస్తుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చింది. విప్రోలో ఉద్యోగుల తొలగింపు కొత్తేంకాదు.గతంలో కూడా ఇతర కంపెనీలకు సైతం పనిచేస్తున్నారన్న కారణంతో 300మందిని ఒకేసారి తొలగించింది. ఇటీవలే క్యూ3 ఫలితాలు ప్రకటించిన సంస్థ మూడోత్రైమాసికంలో కొత్తగా 6వందల మందిని తీసుకుంది. భవిష్యత్తులోనూ రిక్రూట్మెంట్లు భారీగా ఉంటాయని స్పష్టం చేసింది.