ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే ఏప్రిల్ నెల నుంచే వేసవి ఎండలు మండిపోతున్నాయి మే నెలలో సూర్యుడు నడి నెత్తికి వచ్చి తీవ్రంగా మంట పెడుతున్నాడు ఈ ఎండలు తగ్గడానికి ఇంకో నెల పడుతుందని భావిస్తున్నారు.
ఈలోగా సూర్యుడు ఎండలకు సంబంధించి కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు వీటిని వెలుగులోకి తీసుకొచ్చారు.
సూర్యుడి ఉపరితలంలో సంభవించిన రెండు విస్పోటనాలు సౌర జ్వాలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ చిత్రాలను బంధించింది. ఎక్స్ వేదికగా వాటిని నాసా విడుదల చేసింది. సూర్యుడి ఉపరితలంపై శుక్ శనివారాల్లో విస్పోటనాలు జరిగాయని, దాంతో పెద్ద ఎత్తున సౌర తుఫాను ఎగిసిపడగా భూమిని తాకినట్లుగా తెలిపింది.
సూర్యుడి ఉపరితలంపై తొలి విస్పోటనం ఈ నెల 10న అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 9.23 గంటలకు జరిగింది. రెండో విస్పోటనం 11న ఉదయం 7.44 గంటలకు జరిగింది. వాటి తీవ్రత ఎక్స్ 5.8, ఎక్స్1.5గా ఉందని.. ఆ దృశ్యాలను సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ ఫొటోలు క్లిక్మనిపించిందని నాసా పేర్కొంది. సౌర తుఫానులు శుక్రవారం భూమిని తాకగా.. ఖగోళకాంతి ఆకాశంలో కనిపించింది. ఈ అరుదైన దృగ్విషయం ఉత్తర ఐరోపా, ఆస్ట్రేలియాలోని టాస్మానియాతో సహా వివిధ ప్రదేశాల్లో రాత్రిపూట ఆకాశం గులాబీ, ఆకుపచ్చ, ఊదారంగులతో కనిపించాయి. సౌర తుఫానులు భూమిని తాకడంతో నేషనల్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరికలు జారీ చేసింది.
కరోనల్ మాస్ ఎజెక్షన్స్ హెచ్చరికలు చేసింది. సాంకేతిక మౌలిక సదుపాయాలకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. జియోమాగ్నెటిక్ తుఫానులు అయస్కాంత క్షేత్రాల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతాయని.. పవర్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్, ఉపగ్రహ కార్యకలాపాలకు అంతరాయం కలిగించే ప్రమాదం ఉందని పేర్కొంది.
అయితే, స్పేస్ఎక్స్, స్టార్ లింగ్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ సౌర తుఫాను వల్ల ఎదురయ్యే సవాళ్లను, ఉపగ్రహ కార్యకలాపాలపై కలిగించే ఒత్తిడిని అంగీకరించిన ఆయన.. సౌర తుఫాను ప్రభావాన్ని తట్టుకునేలా స్పేస్ఎక్స్ ఉపగ్రహాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదే క్రమంలో మరికొంత కాలం పాటు ఎండలు మండుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ఎండల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది