ఆఫ్గన్లో రక్తపాత నివారణ కోసమే తాను దేశంవీడినట్టు అధ్యక్షుడు ఆష్రఫ్ ఘనీ అన్నారు. తాను ప్రస్తుతం యూఏఈలో ఉంటున్నట్టు చెప్పారు. దేశప్రజల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న విమర్శల నేపథ్యంలో ఫేస్ బుక్ వేదిగ్గా వీడియోసందేశం వినిపించారు.
దేశప్రజల ప్రయోజనంకోసమే దేశాన్ని వీడాను తప్ప తన స్వార్థంకోసం కాదన్నారు ఘనీ. పెద్దమొత్తంలో కరెన్సీతో తాను పారిపోయినట్టు జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. కనీసం కాళ్లకున్న చెప్పులు కూడా మార్చుకునే అవకాశం లేకపోయిందన్నారు. తాను యూఏఈలోనే ఉండిపోనని త్వరలోనే ఆఫ్గన్ వస్తానని…తాలిబన్లు, ప్రభుత్వ అధికారులతో మన మద్దతుదారుల చర్చలు సాగుతున్నాయనీ అన్నారు. అటు మానవతాకోణంలో ఆలోచించే ఘనీని, ఆయన కుటుంబసభ్యులను అనుమతించినట్టు యూఏఈ ప్రకటించింది.