చలన చిత్రాల సెన్సార్షిప్కు కొత్త నిబంధనలు తెస్తూ తెచ్చిన సినిమాటోగ్రాఫ్ (సవరణ) బిల్లు-2021ను సినీ పరిశ్రమ వ్యతిరేకిస్తోందట.. సెన్సార్ అయిన చిత్రాలపై ఫిర్యాదులు వస్తే మళ్లీ పరిశీలనకు పంపడం సవరణ బిల్లులోని కీలక అంశం..
ఇప్పటికే సెన్సార్ పేరిట తమ సృజనను దెబ్బతీస్తున్నారని, మరోసారి సెన్సార్ జరిగితే తమ శ్రమ వృధా అవుతుందని సినిమావాళ్ల ఆందోళన..
వీరు చెబుతున్న సృజన ఏమిటో క్లారిటీ ఇస్తే బాగుండేది. నిజంగా సృజనాత్మకంగా ఉండే మంచి చిత్రాలను ఎప్పుడూ ప్రభుత్వం అడ్డుకోదు. అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తుంది.
అతి శృంగారం, అభ్యంతరకర దృశ్యాలు, అశ్లీల పదాలు, ద్వంద్వార్థాల సంభాషణలు, చెడు మార్గాన్ని పట్టించే దృశ్యాలు, దేశ సమగ్రత, సార్వహౌమాధికారానికి భంగం కలిగించే అంశాలు ఉంటేనే సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఆ దృశ్యాలకు కత్తెర వేస్తోంది.
సెన్సార్ మేనేజ్మెంట్ పూర్తి చూసుకొని వచ్చిన కొన్ని చిత్రాలు అభ్యంతరకరంగా ఉండటం వల్లే మరోసారి సెన్సార్ అవసరం అవుతుంది. పరిస్థితి అంతవరకూ రాకుండా సినిమాలు తీస్తే ఎవరికి అభ్యంతరకరం?.
వాస్తవంగా చెప్పాలి అంటే ఇటీవల వస్తున్న చిత్రాలు చాలా వరకూ సెన్సార్ మార్గదర్శకాలకు చాలా వరకూ ఉల్లంఘిస్తున్నాయి. ముఖ్యమంగా OTTలో వచ్చే చిత్రాలు ఎంత దరిద్రంగా ఉంటున్నోయా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని కూడా సెన్సార్ పరిధిలోకి తేవాల్సిందే..
భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా హద్దులు ఉంటాయి. మంచి చిత్రాలు నిర్మించడం చేతకాకపోతే వేరే వ్యాపారం చేసుకోవడం మంచిది.. ఉత్తమ అభిరుచిగల చిత్రాలు రావాలంటూ మరింత సెన్సార్షిప్ ఉండాల్సిందే..
–క్రాంతిదేవ్ మిత్రా