ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా విజయదశమి ఉత్సవం నిర్వహిస్తున్నది. ఈ ఏడాది సంఘ శతాబ్ది సమయం కాబట్టి ప్రతి బస్తీలోనూ ఉత్సవం చేయాలని యోజన చేయడమైనది. ఇందుకు అనుగుణంగా వాడవాడలా విజయదశమి ఉత్సవం కన్నుల పండుగ గా జరుగుతోంది. ఇంతకీ ఈ విజయదశమి ఉత్సవం ఎందుకు అనే విషయం పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు బయటపడతాయి.
……..
1925లో విజయదశమి సందర్భంలోనే డాక్టర్ హెడ్గేవార్ .. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పని కి శ్రీకారం చుట్టారు. అప్పటికి సంఘం పేరు ఏర్పడలేదు,, వ్యవస్థాగత రూపం కూడా లేదు. కానీ అంతకుమించి దృఢమైన సంకల్పం, దూరదృష్టి ఉన్నాయి.
అందుకే డాక్టర్ జీ ని యుగధృష్ట అని పిలుస్తారు.
…………….
సుమారు ఏడాది తర్వాత సంఘ్ కి పేరు రూప రేఖలు ఏర్పడ్డాయి. అక్కడ నుంచి క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. అయితే, ఆ తేదీలకు పెద్దగా ప్రాధాన్యం ఇచ్చే ఆనవాయితీ లేదు. నిజానికి,
సంఘ్ పరంపరలో అసలు వార్షికోత్సవం అవసరమే లేదు అని డాక్టర్ జి తెలియజేశారు. అందుచేత వార్షికోత్సవం లేదా స్థాపన దినోత్సవం జరుపుకోవడం ఉండదు. కానీ , విజయదశమి కి ప్రాధాన్యత ఉన్నది.
చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నం. అందుకే, ఆర్ ఎస్ ఎస్ కూడా ఈ తత్త్వాన్ని కొనసాగించడానికి విజయదశమి ని ఉత్సవంగా పాటిస్తుంది.
……….
సంఘ్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన ఉత్సవాలు అవసరం లేదని ప్రస్తుత సర్ సంఘఛాలక్ డాక్టర్ మోహన్ జీ భాగవత్ అభిప్రాయపడ్డారు. అంత చేత సంఘ కార్యానికి శతాబ్ది ఉత్సవాలు గా దీనిని పరిగణిస్తున్నారు. సంఘ్ నిర్వహిస్తున్న పనులను సమాజంలో అనువర్తి చేయడమే ఇప్పుడు ప్రధాన అంశంగా నిలుస్తోంది.
ఈ ఏడాది ముఖ్యమైన పంచ పరివర్తన్ అంశాన్ని చేపట్టడం జరిగింది. దీనిని
ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు శతాబ్ది ఉత్సవాలను వేదికగా చేసుకుంటున్నారు.