చైనా వారి పేర్లు చిన్నగా, పొట్టిగా ఎందుకు ఉంటాయి?.. ఉదా: చింగ్, చాంగ్, వాంగ్, లీ, గ్జీ, పెంగ్.. దీని వెనుక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది..
ఒకప్పుడు చైనా వారి పేర్లు చాలా పెద్దగా, పొడువుగా ఉండేవి.. తండ్రులు, తాతలు, ముత్తాతలు, అంతకు ముందు తరాల పేర్లు కూడా కలిపి పెట్టుకునేవారు.. ఆ పూర్తి పేరుతో కచ్చితంగా పిలవాలి అనే నియమం కూడా ఉండేది.. దీంతో ఆ పేర్లు గుర్తు పెట్టుకోవడం కష్టంగా మారింది. జేబులో కాగితాల మీద పేర్లు రాసి ఉంచుకునేవారు..
ఓ గ్రామంలో ఓ కుర్రాడి పేరు ‘ వాంగ్ జింగ్ లీ చెన్ జావో చింగ్ యాంగ్ గ్జూ హు ఝూ హన్ సూ యూపెన్ డింగ్ గూ హున్ చాంగ్ పెంగ్ గ్జీ ‘..
వీడు తన స్నేహితులతో కలిసి వ్యవసాయ బావి దగ్గర అడుకుంటున్నాడు. పొరపాటున బావిలో పడిపోయాడు.. కంగారు పడిన పిల్లలంతా ఊరిలోకి పరుగెత్తి పెద్ద వాళ్లకు చెప్పారు..
ఇంతకీ ఎవడు బావిలో పడ్డాడు? అని అడిగితే అయోమయంతో రకరకాలుగా పేర్లు చెప్పుతున్నారు.. లాభం లేదని పెద్దలంతా అక్కడకు పరుగెత్తి చూస్తే ఆ కుర్రాడు కాస్తా చచ్చి కనిపించాడు.. ఇలాంటి కొన్ని ఘటనలు జరగడంతో చైనా పెద్దలు వీలైనంత చిన్నపేర్లు మాత్రమే పెట్టుకోవాలి అనే కొత్త నియమం పెట్టుకున్నారట.. ఇది ఎంత వరకూ నిజమో కానీ ప్రచారంలో ఉన్న కథ..
Courtesy : Kranti Dev Mithra