రైతుల పరామర్శకు వెళ్లిన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడిచేసిన సంగతి తెలిసిందే. దాడిపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. అదేస్థాయిలో పాల్ బదులిచ్చాడు. అయినా తగ్గని ఆర్జీవీ పాల్ ను టాగ్ చేస్తూ ట్విట్టర్ల వరద కురిపించారు.
పాల్ పై ఓ టీఆర్ఎస్ కార్యకర్త దాడి చేసిన దృశ్యాల్ని మీడియా ప్రసారం చేసింది. అయితే ఆ ఘటనపై వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ ‘పాల్ సింపతీ కోసం ఆ వ్యక్తికి డబ్బులిచ్చి దాడిచేయించుకున్నాడా’ అని ట్వీట్ చేశాడు. అందుకు బదులిస్తూ ‘ఈ ట్వీట్ చేయడానికి కేటీఆర్ దగ్గర ఎంత తీస్కున్నావో చెప్పు’అంటూ కేఏ పాల్ పేరుతో ఓ నెటిజెన్ ట్వీట్ చేశాడు.
అయినా తగ్గని వర్మ వరుసగా ట్వీట్ల మీద ట్వీట్లు చేశాడు. కేఏపాల్ మొఖం మీద అంత దెబ్బకొడితే గాయం కాకపొవడం ఏంటి?పాల్ చర్మం అంత గట్టిగా ఉందా? అని ప్రశ్నించాడు. అంతటితో ఆగక ‘జీసెస్ ను వేలాడదీసినప్పటికంటే పాల్ మీద దాడి చూసి ఎక్కువ బాధపడ్డాను.ఒకవేళ అది నిజమైన దాడే అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడమేంటి? తన ఫ్రెండ్ జీసెస్ కు చెప్పొచ్చుకదా? దాడిగురించి జీసెస్ కు ట్వీట్ చేస్తే ఆయన తెలంగాణ పోలీసులకు ట్వీట్ చేసి దాడిచేసిన వాళ్లపై చర్య తీసుకోమంటాడు కదా..అంటూ ట్వీట్ చేశాడు.
I got doubted because if such a big man hit K A PAUL and why no mark on his face ? So was it a controlled cinematic slap ? Or is K A paul’s skin very thick ??
— Ram Gopal Varma (@RGVzoomin) May 2, 2022
If K A PAUL’S slap is true ,He should tell JESUS to STRIKE the slapper with LIGHTNING , instead of depending on police like ordinary people 😒
— Ram Gopal Varma (@RGVzoomin) May 2, 2022
I think @KAPaulOfficial should give BLESSINGS to the POLICE so that in return the POLICE will give BLESSINGS to him , by protecting him from further SLAPS
— Ram Gopal Varma (@RGVzoomin) May 2, 2022
Why is @KAPaulOfficial not tweeting to JESUS so that JESUS can tweet back to TELANGANA POLICE for them to take STRICT ACTION???
— Ram Gopal Varma (@RGVzoomin) May 2, 2022
ఇంక మరో ట్వీట్లో ‘ మీ దేవుడైన జీసెస్ లా మీకు క్షమాగుణం లేదా?జీసెస్ లాగే మీరు కూడా మిమ్మల్ని కొట్టిన వ్యక్తిని క్షమించండి. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయకండి. చర్యతీసుకోవాలని జీసెసే చెప్తే అతను దేవుడెలా అవుతాడని వర్మ ప్రశ్నించాడు.
Bro @KAPaulOfficial ,u should learn from ur god JESUS and forgive the person who SLAPPED u ,and not put police on him ..if JESUS complained to police ,he won’t be JESUS no bro? ..Don’t u think bro ?
— Ram Gopal Varma (@RGVzoomin) May 2, 2022
‘మీరు పోలీసులకు కంప్లైంట్ చేసేకన్నా జీసెస్ కు, మిమ్మల్ని ప్రేమించే 27దేశాల అధినేతలకు చెప్పండి. మీరు కూడా పోలీసులు, కోర్టులు అంటూ తిరిగితే మీరు జీసెస్ కు దగ్గరగా ఉండి ఏం లాభ?అని పాల్ ను ప్రశ్నించాడు ఆర్జీవీ.
Bro @KAPaulOfficial ,u should complain to JESUS , and all the dictators of 27 countries who LOVE u and also ur darling #EvanderHollyField the boxer to PUNCH me and the GUY who SLAPPED you in our faces 😎
— Ram Gopal Varma (@RGVzoomin) May 2, 2022
Bro @KAPaulOfficial if u also have to resort to police complaints and court petitions, what’s the point of u being close to JESUS bro ? Please tell me bro
— Ram Gopal Varma (@RGVzoomin) May 2, 2022
తెలంగాణ ప్రజలకు నిజంగానే సేవ చేయాలని ఉంటే, ఓట్ల కోసం అడుక్కునే కంటే.. మీ స్నేహితుడైన జీసస్ ను ప్రతి ఒక్క ఓటరుకు కోటి రూపాయలు ఇవ్వమని చెప్పండి” అంటూ ట్వీట్ చేశారు.
Bro @KAPaulOfficial If ur intention is only to serve telangana people, then instead of begging for votes why don’t u tell ur best friend JESUS to give each voter a crore bro ?
— Ram Gopal Varma (@RGVzoomin) May 2, 2022
తెలంగాణాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై అక్కడే ఉన్న ఓ యువకుడు దాడి చేశాడు. కేఏ పాల్ ను చంపదెబ్బ కొట్టాడు. ఈ హఠాత్ పరిణామంతో ఒక్కసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాడి చేసిన యువకుడితో కేఏ పాల్ అనుచరులు గొడవపడ్డారు. దాడి చేసిన యువకుడు టీఆర్ఎస్ నాయకుడు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)