
Supreme Court of India
హైకోర్ట్ న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం ప్రతిపాదించిన పేర్లను కేంద్రం వెనక్కి పంపడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. అభ్యంతరపెట్టడానికి కారణాలు లేకున్నా ఎందుకు సిఫార్సులను అడ్డుకున్నారో తెలియడం లేదంది. కొలీజియం కంటే మెరుగైన వ్యవస్థను కనుక తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తే ఎవరూ అభ్యంతరపెట్టరని…అయితేఅప్పటివరకు అమల్లో ఉన్న చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. కొలీజియం సిఫార్స్ చేసిన పేర్లను ఆమోదించకుండా కేంద్రం ఆలస్యం చేస్తోందంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.