చరిత్రలో బ్రహ్మనాయుడు నాగమ్మ మధ్య జరిగిన పల్నాటి యుద్ధం గుర్తుండే ఉంటుంది. ఆ పల్నాటి సీమలో జరిగిన ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్యం చర్చనీయాంశం గా మారింది. ఎన్నికల పోలింగ్ రోజు నేరుగా పోలింగ్ బూత్ లోకి చొరబడి ఈవీఎంలు పగలగొట్టడం కలకలం రేపుతోంది. దీంతో పిన్నెల్లి వ్యవహార శైలి మీద అంతా మండిపడుతున్నారు.
నిజానికి మాచర్ల నియోజకవర్గం మొదటి నుంచి ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు ఇప్పుడు వైసిపి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పిన్నెల్లి కుటుంబం తరపడుతూ ఉండేది అటు తెలుగుదేశం తరఫున జూలకంటి కుటుంబం గట్టి పోటీ ఇచ్చేది. ప్రస్తుత ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి డిగ్రీ దాకా చదువుకొని యూత్ కాంగ్రెస్ లీడర్ గా రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లో ఆయన పెదనాన్న పిన్నెల్లి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ రాజకీయాలను నడిపించేవారు. ప్రతి ఎన్నికల్లోను రెండు వైపులా తలకాయలు పగల కొట్టుకునేంత కక్షలు కొనసాగుతూ ఉండేవి. ఈ క్రమంలో 2004 లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పిన్నెల్లి లక్ష్మారెడ్డి ఎన్నికయ్యారు అప్పటినుంచి గ్రామాల్లో పిన్నెల్లి కుటుంబం ఆధిపత్యాన్ని పెంచుకుంది. తర్వాత కాలంలో ఆయనకు బ్లడ్ క్యాన్సర్ రావడంతో లక్ష్మారెడ్డి వారసుడిగా తమ్ముడు కొడుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2009లో మాచర్ల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు 2012లో వైసిపి పార్టీ ఏర్పడ్డాక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికలో వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపు సాధించారు. అప్పటినుంచి వైయస్ జగన్ కు సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్నారు. 2014 తెలుగుదేశం జనసేన సత్తా చాటుకున్నప్పుడు కూడా మాచర్లలో మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పట్టు నిలబెట్టుకున్నారు మరోసారి వైసీపీ తరఫున గెలుపు సాధించారు అప్పట్లో చుట్టుపక్కల నియోజకవర్గాలు అయిన అద్దంకి చీరాల వంటి చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి జంప్ అయిపోయారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తెలుగుదేశం నాయకుడు జూపల్లి బ్రహ్మానంద రెడ్డికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత కక్షలు ఉన్నాయి ఈ క్రమంలో పిన్నెల్లి వైసిపి లోనే ఉండిపోయారు 2019లో మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ప్రభుత్వంలో ఆధిపత్యం సంపాదించుకున్నారు ఈ క్రమంలో మాచర్ల నియోజకవర్గంలో ఊరురా టిడిపి వైసిపి మధ్య గొడవలు చెలరేగాయి ప్రతిసారి టిడిపి నేతలు కార్యకర్తలు మీద విపరీతంగా కేసులు పెట్టించారు దీంతో ప్రతి చోట పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఆగ్రహం పెరిగిపోయింది దీనిని తెలుగుదేశం పార్టీ సానుభూతిగా మలుచుకుంది అని చెబుతారు.
ఈ క్రమంలో పోలింగ్ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మేటర్ మొత్తం అర్థమైంది దీంతో తెలుగుదేశం ఓట్లు ఎక్కువ ఫాలో అవుతున్న బూతులలోకి చొరబడి ఈవీఎంలు పగలగొట్టారు అని చెబుతున్నారు అయితే ఈ విషయం బయటికి పోతాయి కొన్నిచోట్ల ఈ దృశ్యాల్ని సెల్ఫోన్లో చిత్రించారు అని టాక్ వచ్చింది. దీన్ని గ్రహించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు.. చడీ చప్పుడు లేకుండా హైదరాబాదుకు జంప్ అయిపోయారు. దీని మీద తెలుగుదేశం వైసిపి విమర్శలు చేసుకున్నాయి.
ఈలోగా పల్నాడు కు సంబంధించిన ఎన్నికల డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను బదిలీ చేశారు. దీంతో పోలింగ్ బూత్ లోని సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. చాలా స్పష్టంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్యాలు వెలుగు చూశాయి.
ఈవీఎంను ఎమ్మెల్యే పిన్నెల్లి పగలగొట్టడాన్ని ఈసీ తీవ్ర అంశంగా పరిగణించింది. పోలింగ్ రోజు ఎమ్మెల్యే పిన్నెల్లి తన అనుచరులతో కలిసి పాల్వాయి గేటు పోలింగ్ బూత్‌లోకి దూసుకెళ్లారు. ఈవీఎంను నేలకేసికొట్టి ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ ఈ ఘటనలో ఇప్పటి వరకూ పిన్నెల్లిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని తక్షణం అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈ ఘటనపై టీడీపీ నేత లోకేశ్ పెట్టిన ట్వీట్‌ను ఈసీ ప్రస్తావించింది.
. ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో పది సెక్షన్లు పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. ఐపీసీ కింద 143, 147, 448 427, 353, 452, 120బి సెక్షన్ల కింద కేసులు, పీడీ పీపీ చట్టం కింద మరో కేసు నమోదు, ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదు నమోదు చేశారు. ఈనెల 20నే పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈవీఎంలను ధ్వంసం చేయడం మీద సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. జీవితంలో ఎన్నికల్లో పాల్గొనకుండా శాశ్వత నిషేధం విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా ఆయన మీద పెట్టిన కేసులు బలంగా నిలుస్తున్నాయి. ఏడు నుంచి పది సంవత్సరాలపాటు జైలు శిక్ష విధించే అవకాశం కూడా కనిపిస్తోంది.