
………………………….
హిందువులకు సంబంధించిన చక్కటి నిర్వఛనాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ డాక్టర్ మోహన్ జీ భాగవత్ అన్నారు. ఇందుకు సంబంధించిన వివరణ ను ఆయన ఇచ్చారు. భారత్‌ను ప్రేమించే ప్రతి ఒక్కరూ హిందువేనని మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. వ్యక్తిగతమైన ఆరాధనా విధానాలు ఏవైనా కావొచ్చు కానీ.. భారత్ ను చూసి గర్వించే వారు, దేశాన్ని ప్రేమించే వారెవ్వరైనా హిందువులేనని నొక్కి చెప్పారు. హిందూ అనేది కేవలం మతపరమైన పదం కాదని, వేల సంవత్సరాల సాంస్కృతిక కొనసాగింపులో పాతుకుపోయిన నాగరికతకు గుర్తింపు అని వివరించారు.
సంఘ్ కార్య శతాబ్దిలో భాగంగా ఆయన అసోంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి మేధావులు, సంపాదకులు, రచయితలు, వివిధ సంస్థల సంస్థాపకులతో జరిగిన సమావేశంలో ఆయన సంభాషించారు. భారత్, హిందూ అనేవి పర్యాయపదాలని, భారత్ హిందూ రాష్ట్రంగా మారడానికి అధికారిక ప్రకటన ఏదీ అవసరం లేదన్నారు. దాని నాగరికత, నైతికత ఇప్పటికే దానిని ప్రతిబింబిస్తూనే వుందన్నారు.అలాగే ఆరెస్సెస్ ప్రాథమిక తత్వాన్ని కూడా ఈ సందర్భంగా స్పష్టంగా వివరించారు. సంఘ ఎవ్వరినీ వ్యతిరేకించడానికి గానీ, హాని చేయడానికి గానీ స్థాపించలేదని పునరుద్ఘాటించారు. కానీ వ్యక్తి నిర్మాణంపైనే ప్రధానంగా దృష్టి పెట్టి, భారత్ విశ్వ గురువుగా మారడానికి దోహపడుతుందన్నారు. ఊహా జనితమైన కథనాలపై సంఘ్‌ను అంచనా వేయవద్దని, శాఖలోకి రావడం ద్వారా సంఘ్‌ని అర్థం చేసుకోవాలని సూచించారు. వైవిధ్యత అన్న దాని మధ్య భారత్ ను ఏకం చేసే పద్ధతినే ఆరెస్సెస్ అంటారని వివరించారు.
అలాగే పంచపరివర్తన్ గురించి కూడా కూలంకషంగా వివరించారు. ఇక.. అసోంలో జనాభా మార్పులు ,సాంస్కృతిక పరిరక్షణ గురించి, ఆందోళనల గురించి కూడా మాట్లాడారు. ఒకరి భూమిపై విశ్వాసం కలిగి వుండాలని, అప్రమత్తతతో పాటు దృఢమైన అనుబంధాన్ని కలిగి వుండాలని పిలుపునిచ్చారు. అక్రమ చొరబాటు, సమతుల్య జనాభా విధానం అవసరం మరియు విభజనకరమైన మత మార్పిళ్ల నిరోధం గురించి కూడా మాట్లాడారు. ముఖ్యంగా సోషల్ మీడియాను యువత అత్యంత బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. అలాగే స్వాతంత్రోద్యమ సమయంలో డాక్టర్జీ పాత్ర, అనుభవించిన జైలు జీవితంతో పాటు క్విట్ ఇండియా ఉద్యమంలో దేశవ్యాప్తంగా లెక్కలేనంత మంది స్వయంసేవకుల పాత్రను కూడా గుర్తు చేసుకున్నారు. స్వాతంత్రోద్యమంలో కూడా స్వయంసేవకుల పాత్రను తెలియజేశారు.
స్వయంసేవకులు వివిధ క్షేత్రాలలో అందిస్తున్న సేవలను మోహన్ జీ చక్కగా వివరించారు.



