భారత్ లో తయారైన కాఫ్ సిరప్ ఉజ్బెకిస్తాన్లో చిన్నారుల మృతికి కారణమయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో WHO స్పందించింది. రెండురకాలైన మందులను వాడవద్దని ఉజ్బెకిస్తాన్ కు సూచించింది. ఆ రెండింటిని నోయిడాకు చెందిన మరియన్ బయోటెక్ సంస్థ వాటిని ఉత్పత్తి చేసింది. వాటి పేర్లు అబ్రోనాల్, డాక్-1 మ్యాక్స్ . ఆ మందుల్లో పరిమితికి మించి డై ఇథలిన్ గ్లైకాల్, ఇథిలిన్ ఉన్నట్టు లాబ్ రిపోర్టుల్లో తేలింది. ఆ మందులు నాసిరకమైనవి. తయారీలో సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ మందులు తీసుకున్న కొందరు చిన్నారులు శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతూ చనిపోయారు.