కేరళలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి..తాజాగా బాలికపై జరిగిన అఘాయిత్యం ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది.
మహిళలకు రక్షణ కరవైందంటూ వారి భద్రతకు చర్యలు తీసుకోవాలంటూ..సాక్షాత్తూ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కేరళ గాంధీ మెమోరియల్ లో ఉపవాసం దీక్ష చేశారు. జూలై 14 ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఆయన దీక్ష చేపట్టారు. గత ఐదు నెలల్లో కేరళలో 1573 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. వారిలో 627 మంది 10 సంవత్సరాల కంటే తక్కువ వయసుపిల్లలు. అటు తాజాఘటనపై కేంద్ర బాలల హక్కుల సంఘం స్పందించింది.కేసును సుమోటోగా తీసుకుంది.
                                                                    



