హుజూరాబాద్ లో పార్టీల డబ్బు పంపిణీ కలకలం రేపుతోంది. ప్రతిగ్రామానికి ఓ పార్టీ సీల్డ్ కవర్లలో డబ్బులు పంపి పంపిణీ చేసిందన్న వార్తలు వచ్చాయి. అధికారపార్టీఅయితే ఓటుకు ఏకంగా ఆరువేల రూపాయలిచ్చినట్టు సమాచారం. దీంతో తమకేవి డబ్బులు, మాకెందుకీయరు ఆరువేలంటూ ఓటర్లు ఆందోళనకు దిగారు. పెద్దమొత్తం కావడంతో దాదాపు ప్రతీగ్రామంలో ప్రజలు రోడ్డెక్కారు. కొన్నిచోట్ల ధర్నాలు, ఆందోళనలు, బైఠాయింపులు జరిగాయి. అందుకు సంబంధించిన వీడియోలు తెగవైరల్ అవుతున్నాయి.