ప్రపంచవ్యాప్తంగా రెండు గంటలపాటు వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. అసలే జరిగిందో తెలియక యూజర్లు ఇబ్బందిపడ్డారు. ఒక్కసారిగా సర్వీస్ నిలిచిపోవడంతో డేటా ఆగిపోయిందా లేక ఇంకేమన్నా సమస్యా అంటూ అయోమయం చెందారు. కొందరైతే అల్లాడిపోయారు.ఇతర సోషల్మీడియా మాధ్యమాల ద్వారా అసలు విషయం తెలుసుకుని తేలికపడ్డారు. వాట్సప్ తప్పమెటా ఇతర ప్లాట్ ఫ్లామ్స్ అయిన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లు మాత్రం పనిచేశాయి.
దాదాపు రెండు గంటలకు అంటే గం. 2.20 ని. తరువాత తిరిగి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏకంగా రెండుగంటలకు సర్వీస్ కు అంతరాయం కలగడం వాట్సప్ చరిత్రలో ఇదే మొదటిసారి.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వాట్సప్ ను వినియోగిస్తుంటారు. దీంతో కాసేపు సేవలు ఆగినంతనే యూజర్లు అల్లాడిపోయారు. విషయం తెలిసిన కాసేపట్లో మీమ్స్ హల్ చల్ చేశాయి.
https://twitter.com/ANI/status/1584815019346169857?s=20&t=b2EbH_1idXMOObIpLDIvaw