కర్నాటక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రధాన పార్టీలు ప్రచార వేగం పెంచాయి. మొదట్లో సర్వేలన్నీ కాంగ్రెస్ కే గెలుపు అవకాశాలని చెప్పాయి. అయితే కొద్దిరోజులుగా చోటుచేసుకున్న పరిణామాలతో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతోంది. ఆ పార్టీ నేతల కామెంట్లే అందుకు ప్రధాన కారణం. లింగాయత్ ముఖ్యమంత్రులు అవినీతిపరులు అని సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. లింగాయత్ డ్యామ్ తెగిపోయింది అని, వారి ఐక్యత దెబ్బతినేలా డీకే శివకుమార్ చేసిన కామెంట్లు. ప్రధానిని ఖర్గే విషపాము అనడం, ఇక తాము అధికారంలోకి వస్తే బజరంగ దళ్ ను నిషేధిస్తామని ఆ పార్టీ ఏకంగా మేనిఫెస్టోలో చేర్చడం బీజేపీకి కొత్త శక్తిని ఇచ్చిందని చెప్పవచ్చు.
ఇక కొన్నిరోజులుగా ప్రధానిమోదీ తో పాటు అమిత్ షా, యోగీ ఆదిత్యనాథ్ లు ప్రచారం రంగంలో దిగడంతో బీజేపీ గ్రాఫ్ క్రమంగా పెరుగుతోంది. ముఖ్యమంత్రి బొమ్మై అయితే ఇప్పటికే వంద నియోజకవర్గాల్లో ప్రచారం చేసేశారు. ఇక కాంగ్రెస్ సైతం డూ ఆర్ డై అన్నట్టుగానే కాంగ్రెస్ ఎన్నికల రణక్షేత్రంలో దూసుకుపోతోంది. కర్నాటకకే చెందిన పార్టీ చీఫ్ ఖర్గే, సీనియర్లు రాహుల్, ప్రియాంక తో పాటు…..సీనియర్లు డీకే శివకుమార్, సిద్ధరామయ్యలు శక్తికిమించి పార్టీ గెలుపుకోసం పనిచేస్తున్నారు. ఇక జేడీఎస్ కుమారస్వామి సైతం సర్వశక్తులూ ఒడ్డుతూ ఒక్కడై తిరుగుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా అక్కడ వేళ్లూనుకుని ఉంది. దేశమంతటా వ్యతిరేక గాలులు వీచిన సమయంలోనూ కన్నడ ఓటర్లు హస్తంపార్టీకి అండగా నిలిచారు సమర్థులైన, ప్రజాకర్షకులైన నాయకులు ముందునుంచీ ఉన్నారు. ఇప్పుడు కూడా.. కురుబ కులానికి చెందిన సిద్ధరామయ్య , కీలకమైన వక్కలిగ సామాజిక వర్గానికి చెందిన డీకేశివకుమార్ పార్టీని నడిపిస్తూ గెలుపే లక్ష్యంగా సాగుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు అన్నిప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ పార్టీకి నెగెటివ్ పాయింట్స్ లేకపోలేదు. అంతర్గత కలహాలకు తోడు… కేంద్ర నాయకత్వం బలంగా లేకపోవడం ఆ పార్టీకి ఇబ్బందే. బలమైన లింగాయత్ నాయకులే లేరు. అయితే ఇటీవల జగదీశ్ షెట్టార్ కాంగ్రెస్ లో చేరారు. ఆయన చేరిక ఏ మేరకు కలిసివస్తుందో చూడాలి.
బీజేపీ 2004 నుంచి 2013 ఎన్నికల్లో మినహా అతిపెద్ద పార్టీగా నిలుస్తూ వస్తోంది. గత ఎన్నికల్లో కూడా అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడా మెజారిటీ స్థానాలు దక్కలేదు. దీంతో కాంగ్రెస్, జేడీఎస్ లనుంచి పలువురు రాజీనామాలు చేసి బీజేపీనుంచి తిరిగి ఎన్నికయ్యారు. లింగాయత్ లు ముందునుంచీ బీజేపీకి అండగా ఉంటున్నారు. ఇప్పటివరకు ఆ పార్టీ నుంచి సీఎంలు అయిన నలుగురిలో సదానందగౌడ తప్ప మిగిలిన ముగ్గురూ లింగాయత్ లే. సదానందగౌడ వక్కలిగ. ఇక కాంగ్రెస్ కు లేని బీజేపీకున్న అదనపు బలం కాంగ్రెస్ సెంట్రల్ లీడర్షిప్. దక్షిణాదిన కర్నాటకలో మోదీకున్న క్రేజ్ ఎక్కువ. ఇన్ని అనుకూలతలతో పాటు ప్రతికూలతలూ ఉన్నాయి. ఐదేళ్ల పాలన సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పార్టీ బలంగా ఉంది అనుకునే బెంగళూర్ లో…ఇతర అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ పర్సంటేజీ చాలా తక్కువ ఉంటుండడం పార్టీకి ఆందోళన కలిగించే విషయం. హిందుత్వవాదులు చనిపోతున్నా కేంద్రం స్పందించలేదనే ఆగ్రహం పార్టీపట్ల వ్యక్తమవుతోంది. జనతాదళ్ ఒకప్పుడు రాష్ట్రమంతా ఉండేది. కానీ ప్రభావం, ప్రాభవం తగ్గుతూ వచ్చింది. తరువాత పార్టీ ఓ సామాజిక వర్గానికి, ఓ ప్రాంతానికే పరిమితం అన్నట్టైంది.
ప్రాంతాలవారీగా బలబలాలు .
కోస్టల్ కర్ణాటక: కేరళ సరిహద్దు కూడా… సంఘ్ ప్రభావం ఎక్కువ, హిందూ ముస్లిం గొడవలు కూడా…sdpi pfi ప్రభావం ఎక్కువ… ఇక్కడ బీజేపీ మెజార్టీ స్థానాలు గెలుస్తుంది అక్క…
2. ముంబై కర్నాటక లేక కిత్తూరు కర్ణాటక… మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం…
మరాఠీలు, లింగాయత్ లు ఎక్కువ… అదే సమయంలో సంఘ్ మరియు జాతీయవాదం ఎక్కువ ఇక్కడ… పోటాపోటీగా ఉంది… ఈ ప్రాంతంలోనే ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్ సవది ,మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ బీజేపీనుండి కాంగ్రెస్ వెళ్లారు…బీజేపీ అధికారంలోకి రావాలి అంటే యిక్కడ ఎక్కువ స్థానాలు గెలవాలి…బీజేపీకి కాస్త ఎడ్జ్ ఉంది…
కల్యాణి కర్ణాటక లేక హైద్రాబాద్ కర్ణాటక: తెలంగాణ సరిహద్దు ప్రాంతం…
ఇక్కడ కాంగ్రెస్ ఆధిపత్యం కాస్త ఎక్కువగా కనిపిస్తోంది… తెలుగువారు, లింగాయత్, ముస్లిములు జనసంఖ్య ఎక్కువ…
మధ్య కర్ణాటక: హావేరి దావణగెరె చిత్రదుర్గ తూముకూరు జిల్లాలు…హోరాహోరీగా పోరు ఉంది ఇక్కడ…బీజేపీ కాంగ్రెస్ సగం సగం గెలవచ్చు…
ఓల్డ్ మైసూరు: ఇక్కడ ఒక్కలిగ/గౌడ కమ్యూనిటీ ఆధిపత్యం ఎక్కువ… మైసూరు మండ్య రామనగర చిక్కబల్లపురా, కోలారు జిల్లాలు వస్తాయి…ఇక్కడ jds కాంగ్రెస్ ఎక్కువ స్థానాల గెలుస్తాయి… బీజేపీ అధికారంలోకి రావాలి అంటే ఇక్కడ కనీసం 15-20 స్థానాలు గెలవాలి…
కోలారు చిక్కబల్లపురా జిల్లాలో తెలుగువారి ప్రభావం ఉంది కానీ స్థానిక తెలుగువారు వలస వచ్చిన వారు కాదు..
బెంగళూరు నగరం : 28స్థానాలు ఉన్నాయి నగరంలో, కన్నడ తెలుగు తమిళులు, ముస్లిములు ప్రభావం.అన్ని స్థానాల్లోనూ పోటాపోటీ ఉంది.
కొన్నిరోజుల క్రితం వరకు కన్నడ ఓటరు కాంగ్రెస్ వైపు కాస్త మొగ్గుగా ఉన్నమాట వాస్తవం. అయితే పరిణామాలు రోజుకో విధంగా మారుతున్నాయి. కన్నడ ఓటరు మదిలో ఏముందో తెలిసేది నాలుగురోజుల తరువాతనే.