2014 లో మోదీ ప్రభుత్వం వచ్చాక ఈడీ దాడులు ఎక్కువ అయ్యాయి. రాజకీయ అవసరాల కోసం ఈడీని వాడుకుంటున్నారు అనే ఆరోపణల నేపధ్యంలో మొన్న కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వివరాలు తెలిపింది. మనీలాండరింగ్ చట్టం అంటే PMLA చట్టం 2002ను వాజ్ పేయి ప్రభుత్వం తెచ్చినా.. యూపీఎ ప్రభుత్వం వచ్చాక 2005 నుంచి అమలు చేయడం మొదలు పెట్టింది అని, 2005-2014 మధ్య 9 సం. లలో ఈ PMLA చట్టం క్రింది ఈడీ మొత్తం 112 సోదాలు మాత్రమే నిర్వహించి ₹5346 కోట్ల ఆస్తులు జప్తు చేశారని.. 104 ప్రాసెక్యూషన్ కంప్లైంట్స్ ఫైల్ చేసినా ట్రయల్ కోర్ట్ ఈ ఆస్తులు జప్తు చేసిన ఏ కేసుల్లోనూ ఏ ఒక్కరినీ దోషులుగా
నిర్ధారించలేదు అని రాజ్యసభకు తెలిపింది.
అలాగే, 2014లో మోదీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ PMLA అంటే మనిలాండరింగ్ చట్టం క్రింద గత ఎనిమిది సం.లలో ఈడీ 3010 సోదాలు నిర్వహించిందని.. 888 ప్రాసిక్యూషన్ కంప్లైంట్స్ ఫైల్ చేసి ₹99,356 కోట్ల ఆస్తులు అంటే సుమారు లక్ష కోట్ల విలువ చేసే ఆస్తులు జప్తు చేశారని మంత్రి రాజ్యసభకు తెలిపారు. ఇప్పటి వరకు 23 కేసుల్లో నేరాలు రుజువు అయ్యి సుమారు ₹900 కోట్ల ఆస్తులు స్వాధీనం చేసుకున్నాం.. మిగతా కేసులు కోర్టుల్లో ఉన్నాయని చెప్పారు.
అంటే యూపీఏ టైం(9 సం.ల)లో సుమారు ₹5400కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేస్తే.. ఎన్డీయే(8 సం.ల) కాలంలో సుమారు
లక్ష కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేశారు. ఈ PMLA కేసుల్లో సోనియా, రాహుల్, మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం సహా అతని పుత్ర రత్నం కార్తీ చిదంబరం, పవార్ పార్టీ నేతలు, మహారాష్ట్ర మాజీ మంత్రులు నవాబు మాలిక్, దేశాముఖ్, ఢిల్లీ ఆప్ ఆరోగ్య మంత్రి కేజ్రీ కుడి భుజం సత్యేంద్ర జైన్ మొదలగు ప్రముఖలపై కూడా కేసులు ఉన్నాయి. అందుకే ఈ ఏడుపులు, పెడబొబ్బలు.
అసలు ఈ మనీ లాండరింగ్ చట్టం ఇంకా కఠినంగా అమలుచేయడానికి వీలుగా యూపీఏ ప్రభుత్వంలో అప్పటి ఆర్ధిక మంత్రి చిదంబరం 2012 సం.లో ఈ చట్టంలో మార్పులు కూడా తెచ్చారు. దానిలో నిందితులకు అవసరమైన రక్షణ కల్పించే సెక్షన్స్ కూడా పెట్టారు. ఇప్పుడు వీళ్ళే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ మనీ లాండరింగ్ చట్టం ప్రజల హక్కులకు భంగం కలిగించే విధంగా విచ్చలవిడి అరెస్టులు, ఆస్తుల జఫ్తుకి అవకాశం ఇస్తోంది, కాబట్టి ఈ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించమని చిదంబరం కొడుకు కార్తీ చిదంబరం సహా పలువురు సుప్రీంకోర్టులో కేసు వేశారు. గతవారం ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ మనీ లాండరింగ్ చట్టంలోని అన్ని సెక్షన్స్ ని సమర్థిస్తూ తీర్పు చెప్పింది. ఈ PMLA చట్టాన్ని Cr PC చట్టంతో పోల్చకూడదు. ఈ చట్టం ద్వారా అధికారులకు ఇచ్చిన అధికారాలు వారికి ఇవ్వకపోతే ఈ చట్టం ఏ ఉద్దేశ్యంతో తీసుకువచ్చారో దాని ఫలితాలు ఇవ్వకుండా కాగితం మీద మాత్రమే మిగిలిపోతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ, ఈ చట్టం ఎందుకు అవసరమో 1999లో అప్పటి ఆర్ధిక మంత్రి యశ్వంత్ సిన్హా తోపాటు 2012లో ఆర్థిక మంత్రి చిదంబరంలు పార్లమెంటులో చేసిన ప్రసంగాలలో ముఖ్య అంశాలను ఉటంకించింది.
సుప్రీంకోర్టు తీర్పుతో చాలా మంది నోర్లు మూతపడ్డాయి.
~ చాడా శాస్త్రి