నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును పోలీసులు కొట్టారన్న వార్తలు కలకలంరేపుతున్నాయి..ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలో కేసు నమోదుచేసిన సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే..నిన్నటినుంచీ ఆయన కస్టడీలోనే ఉన్నారు.అయితే ఆయన ఒంటిమీద గాయాలుండడంతో… దీనిపై విచారణకు కోర్టులో స్పెషల్ డివిజన్ బెంచ్ ఏర్పాటైంది. స్పెషల్ మూవ్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. రఘురామరాజు కాలి దెబ్బల ఫొటోలు చూసిన హైకోర్టు డివిజనల్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కస్టడీలో ఉన్న ఎంపీని ఎలా కొడతారని ప్రశ్నించింది..ఎంపీ ఒంటిపై గాయాలు నిజమే కనుక అయితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది..
అటు రఘురామకు కేంద్రం కల్పించిన వై కేటగిరి భద్రత కొనసాగించాలని ఆయన తరపు న్యాయవాది సీనియర్ లాయర్ ఆదినారాయణరావు కోర్టును కోరారు. ఆయన కుటుంబసభ్యులను అనుమతించడంతో పాటు… మెడికల్ కోర్ట్ రిపోర్ట్ రేపు ఉదయం 10:30లోపు ఇచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు..
అటు …అంతకుముందు ఉదయం ఆయన్ని ప్రశ్నించిన సీఐడీ పోలీసులు అనంతరం గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. పోలీసులు తనను కొట్టారంటూ సీఐడీ కోర్టు న్యాయమూర్తికి రఘురామ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు..
అనంతరం రఘురామ కేసుపై జస్టిస్ ప్రవీణ్‌కుమార్, జస్టిస్ లలితల ఆధ్వర్యంలో స్పెషల్ డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. రఘురామను సీఐడీ పోలీసులు కొట్టారని, ఆయన నడవలేక పోతున్నారని ఆయన తరపు న్యాయవాది ఆదినారాయణరావు హైకోర్టుకు రాసిన లేఖరాశారు.. దీనిపై మెడికల్ కోర్టు ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఒంటిమీద గాయాలకు చికిత్సకోసం ప్రభుత్వాస్పత్రికి తరలించాలని సీఐడీ కోర్టు ఆదేశించగా రఘురామ అందుకు నిరాకరించారు…అనంతరం ఆయన విజ్ఞప్తిమేరకు రమేశ్ ఆస్పత్రికి తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది..