ఇండియా గేట్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అమర్ జవాన్ జ్యోతి జ్వాలని జాతీయ యుద్ధ స్మారకంతో (వార్ మెమోరియల్) కలపడం గురించి కాంగ్రెస్ తీవ్ర చర్చ లేవదీసింది. ఇండియా గేట్ వద్ద పెట్టిన జ్వాల తీసివేసి మోడీ అమరవీరుల త్యాగాలను అవమాన పరిచారు అని కాంగ్రెస్ మరియు దాని వందిమాగధులు విమర్శస్తున్నారు.
కానీ అసలు ఇండియా గేట్ దగ్గర పెట్టిన జ్వాల తాత్కాలికమేనని, యుద్ద వీరుల స్మారకం శాశ్వతంగా నిర్మించేవరకు మాత్రమే ఇది వుంటుంది అని అప్పటి ప్రభుత్వం పార్లమెంట్ లో చెప్పింది.
రెండు జ్వాలల విలీనం అవసరమా అనే వివాదానికి నాటి పార్లమెంట్ రికార్డ్స్ జవాబు చెపుతున్నాయి.
సెప్టెంబర్ 1, 1972న లోక్సభలో “విక్టరీ మెమోరియల్ నిర్మాణం”పై అడిగిన ప్రశ్నకు వ్రాతపూర్వక సమాధానం ఇస్తూ, అప్పటి రక్షణ మంత్రి జగ్జీవన్ రామ్ యుద్ధ స్మారక చిహ్నం మరియు అమర్ జావాన్ జ్యోతి యొక్క తాత్కాలిక స్వభావాన్ని ప్రస్తావించారు. ఇండియా గేట్ వద్ద అమర వీరుల జవాన్ జ్యోతి ప్రజ్వలన చేసినప్పటి సమయంలొ అప్పటి ప్రభుత్వ భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు.
కాంగ్రెస్కు చెందిన జునాగఢ్ ఎంపీ వెకారియా నంజీభాయ్ రావ్జీభాయ్ ఈ క్రింది
ప్రశ్న వేశారు.
“డిసెంబర్ 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో మరణించిన సాయుధ బలగాల సిబ్బంది పేర్లతో లిఖించబడిన ఒక విజయ స్మారకాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నాదా? అలా అయితే అది ఎక్కడ నిర్మిస్తున్నారు? ఆ ఆలోచన లేకపోతే దానికి కారణాలు ఏమిటి?”
ఆ ప్రశ్నకు సమాధానంగా రక్షణమంత్రి జగ్జివన్ రామ్ మాట్లడుతూ.
“ఢిల్లీలోని ఇండియా గేట్ ఆర్చ్ కింద ఇప్పటికే అమర్ జవాన్ జ్యోతితో కూడిన తాత్కాలిక వార్ మెమోరియల్ నిర్మించబడింది. కానీ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి యుద్ధంలో మరణించిన వారందరి జ్ఞాపకార్థం ఢిల్లీలో శాశ్వత యుద్ధ స్మారకాన్ని (అమర్ జవాన్ స్మారకం) నిర్మించాలనే ప్రతిపాదన ప్రభుత్వం యొక్క క్రియాశీల పరిశీలనలో ఉంది. డిసెంబరు 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంతో సహా యుద్ధంలో చనిపోయిన వారి పేర్లను వ్యక్తిగతంగా లిఖించాలా లేదా అప్పటి నుండి వివిధ సైనిక కార్యకలాపాలు మరియు సంఘర్షణలలో పాల్గొన్న రెజిమెంట్లు మరియు యూనిట్ల పేర్లను చెక్కడం ద్వారా వారి జ్ఞాపకార్థం సమిష్టిగా స్మరించబడుతుందా? అనేది సరైన సమయంలో నిర్ణయం తీసుకోబడుతుంది, ”అని జగ్జీవన్ రామ్ లోక్సభలో చెప్పారు.
అంటే అమర వీరులకు శాశ్వత స్మారకాన్ని నిర్మించాలి అని 1971 లోనే అనుకున్నా, ఆ తరువాత కాంగ్రెస్ దశాబ్దాలు పాటు అధికారంలో ఉన్నా ఆ స్మారకం నిర్మించాలి అనే ఆలోచన యెప్పుడూ చేయలేదు. రిటైర్ అయిన సైనికులకు ఒక రాంక్ ఒక పెన్షన్ ప్రతిపాదన అనుకుని పక్కన పడేసి నట్లే ఇదీ పక్కన పడేశారు.
OROP సమస్యపై దశాబ్దాలు పడుకున్న కాంగ్రెస్ మోడీ అధికారంలోకి వచ్చాక సైనికులకు OROP అమలు చేయాలి అని సిగ్గు లేకుండా మోడీ పై వత్తిడి తెచ్చారు. తీరా మోడీ OROP అమలు చేస్తే దాన్లో ఇంకా లోపాలు వున్నాయి అని సైనికులను రెచ్చగొట్టింది.
మోడీ 2014 ఎన్నికల సమయంలో అమర వీరులకు ఢిల్లీ లో ఒక భవ్యమైన శాశ్వతమైన వార్ మెమోరియల్ నిర్మిస్తానని చెప్పారు. చెప్పినట్లు గానే 5 సం. ల. లోపే నిర్మించి అందులో అమరులైన అందరి పేర్లు చెక్కించి 2019 ఫిబ్రవరిలో ప్రారంభోత్సవం చేశారు.
కాంగ్రెస్ నాయకులకు, మోడీ ద్వేషులకు లేపి తన్నించుకుంటూ వుండడం బాగా అలవాటు అయిపోయింది.
Courtesy : చాడా శాస్త్రి