ఏమయ్యా పాస్టర్ మాథ్యూ.. మనుమరాలు వయసున్న బాలికను అలా చేస్తావా..?
కేరళలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. 74 ఏళ్ల వయస్సు ఉన్న పాస్టర్ మైనర్ బాలికపట్ల లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కేరళలోని ఎర్నాకులం జిల్లా కున్నతునాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పాస్టర్ మాథ్యూ.. ఇడుక్కి జిల్లాలోని కొన్నాథాడి సమీపంలో ఉన్న ముకద్దంలో నివసిస్తున్నాడు. స్థానికంగా క్రైస్తవ మతానికి సంబంధించి బోధిస్తూ.. ఇళ్ల మధ్య ప్రచారం చేపడుతుంటాడు. అయితే ఈ క్రమంలో జనవరి నెలలో ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు దిగినట్లు తెలుస్తోంది. విషయాన్ని బాధిత బాలిక తన తల్లితో చెప్పడంతో.. విషయం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సదరు పాస్టర్ మాథ్యూను ఫిబ్రవరి 20వ తేదీన అరెస్ట్ చేశారు. పాస్టర్ మాథ్యూపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టులో హజరుపరచి రిమాండ్కు తరలించారు. అయితే బాధిత బాలిక మైనర్ కావడంతో పూర్తి విషయాలను పోలీసులు వెల్లడించలేదు.