మోదీ స్టేడియం సంగతేంటి…ఈ జాబితా చూడండి మరి!
రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం పేరును ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా మార్చడాన్ని చాలామంది స్వాగతిస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకున్నట్టు మోదీ ప్రకటించగానే వివిధ సోషల్ మీడియా వేదికలుగా నెటిజన్లు స్వాగతించారు. క్రీడాకారులకు ఇచ్చే పురస్కారానికి రాజకీయనాయకుల పేర్లు కాక… క్రీడాప్రముఖులపేర్లు పెట్టడమే సముచితమంటూ అభిప్రాయపడ్డారు. అయితే కొందరు ముఖ్యంగా కాంగ్రెస్, గాంధీ కుటుంబఅభిమానులు మాత్రం మోదీ నిర్ణయాన్ని తప్పుబట్టారు.మరి మోతెరా స్టేడియానికి పెట్టిన మోదీని పేరును తొలగిస్తారా అంటూ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. అందుకు బీజేపీ శ్రేణులు, మోదీ అభిమానులేం తక్కువ తినలేదు. గాంధీ-నెహ్రూ కుటుంబ వారసుల పేర్లమీద ఉన్న వందలాది స్టేడియాలు, కట్టడాలు, వీధుల పేర్లను కూడా మార్చితే..మోదీ పేరు కూడా మారుస్తామంటూ ట్రోల్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. వాళ్ల పేర్లమీద ఉన్న స్టేడియాల జాబితా మొత్తం తీసి షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.