ఉక్రెయిన్ పై రష్యా చర్యను సమర్థించింది మిత్రదేశం చైనా. రష్యా చేస్తోంది యుద్ధం కాదని సైనిక చర్య మాత్రమేనని అంది. పరిస్థితుల్ని గమనిస్తున్నామని.. అయితే ఇరుదేశాలు సంయమనం పాటించాలని ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి హువా చునియింగ్ అన్నారు. అసలు ఉక్రెయిన్ సంక్షోభం చాలా చిన్నదని… పాశ్చాత్య దేశాలు పెద్దదిగా చూపే ప్రయత్నం చేస్తున్నాయని చైనా వ్యాఖ్యానించింది. వివాదానికి కారణం అమెరికానే అని చైనా ఇప్పటికే మండిపడిన సంగతి తెలిసిందే.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)