
File Photo
శుక్రవారం పశ్చిమబెంగాల్లో హౌరాలోనూ హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఇందుకు కారణం బీజేపేనని మమతా మండిపడింది.బీజేపీ చేసిన పాపానికి ప్రజలెందుకు బాధపడాలని ప్రశ్నించారు. అల్లర్లకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నూపుర్ శర్మ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా దుమారం రేగింది. నూపుర్ ను అరెస్టు చేయాలని ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. హౌరాలో జాతీయ రహదారిని దిగ్బంధనం చేసి, పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.అల్లర్లపై ఆందోళన వ్యక్తం చేస్తూ…బీజేపీ చేసిన పాపానికి ప్రజలెందుకు బాధపడాలని… హౌరాలో జరుగుతున్నదాని వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయన్నారు. అల్లర్లు జరగాలని ఆ పార్టీలు కోరుకుంటున్నాయని మమతా ట్వీట్ చేశారు.
నూపుర్ శర్మ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా హౌరా లోని జాతీయ రహదారిపై రెండు రోజుల నుంచి జరుగుతున్న నిరసనల నేపథ్యంలో పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 144 నిబంధనలను అమలు చేస్తున్నారు. ఉలుబెరియా సబ్ డివిజన్, హౌరా పరిధిలోని జాతీయ రహదారి, రైల్వే స్టేషన్ల పరిసరాల్లో ఈ నిబంధనలు జూన్ 15 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాల్లో శుక్రవారం హింసాత్మక సంఘటనలు జరిగాయి.




