పశ్చిమబెంగాల్లో కలకలం రేపిన 14 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై సీఎం మమతా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.ఘటనపై సందేహాలు వ్యక్తం చేస్తూ… యువతిపై రేప్ జరిగిందో లేక గర్భవతిగా ఉందో తెలుసుకోవాలని ఉందని ఆమె అన్నారు. అటు నిందితుడైన టీఎంసీ నేత కుమారుడైన 21 ఏళ్ళ నిందితుడిని స్థానిక కోర్టు 14 రోజుల పోలీస్ కస్టడీ కి పంపింది. మమత ప్రకటనపై కాంగ్రెస్, సీపీఎం, బీజేపీ సహా ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
కోల్కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ పోలీస్ చీఫ్ మనోజ్ మాలవ్య సమక్షంలో మమత మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. “అమ్మాయి నిందితుడితో సంబంధం కలిగి ఉంది. ప్రతిపక్ష పార్టీలు, మీడియా ఈ సంఘటనకు “రాజకీయ ట్విస్ట్” ఇస్తున్నాయి. జరిగిన సంఘటన బాధాకరం, నేను దానిని ఖండిస్తున్నాను. అయితే నిందితుడికి, అమ్మాయికి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని విన్నాను. చుట్టుపక్కల వారికి తెలుసు, వారి కుటుంబాలకు తెలుసు, అందరికీ తెలుసు”అని ఆమె అన్నారు.
సంఘటన ఏప్రిల్ 5న జరిగితే ఎఫ్ఐఆర్ మాత్రం ఏప్రిల్ 10న రిజిస్టర్ అయింది. ఎందుకు?.. ఇప్పుడు పోలీసులకు ఎక్కడి నుంచి ఆధారాలు లభిస్తాయి? అని డిజిపి వైపు చూస్తూ.. నేను చెప్పింది నిజమా, కాదా” అని ప్రశ్నించారు.ప్రధాన నిందితుడు ఏప్రిల్ 4న తన పుట్టినరోజు వేడుకకు ఆమెను ఆహ్వానించాడని, అక్కడ మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని.. ఆమె మరుసటి రోజు ఉదయం అధిక రక్తస్రావం కారణంగా మరణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ నిందితుడి మమత కాపాడాలనుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నారు.”ఘటనను మమత వివరించిన తీరు దురదృష్టకరం. ఇది ఉద్దేశపూర్వకంగా నిందితులను రక్షించే ప్రయత్నమా?” అని సీపీఎం నేత సుజన్ చక్రవర్తి అన్నారు.
అటు అసెంబ్లీలో విపక్షనేత సువేందు అధికారి సైతంసీఎంపై ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. “ఆమె మాట్లాడుతున్న భాష చాలా అసహ్యంగా ఉందని..అసలు చట్టబద్దమైన పాలనే రాష్ట్రంలో లేదని…ఇలాంటి వాళ్లకి ఓటువేసిన ప్రజలు ఆలోచించాలని ఆయన అన్నారు. గవర్నర్ జగదీప్ ధన్ఖర్ను కూడా కలిసి ఘటనను వివరించారు. ఇదిలా ఉండగా, మమత వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ… BJYM ఆధ్వర్యంలో కలకత్తా విశ్వవిద్యాలయంలో నిరసనలు నిర్వహించారు.
మరోవైపు నిందితుడి తండ్రి టిఎంసి నేత కావడంతో తమ ప్రభుత్వం వారికి రక్షణ కల్పిస్తోందన్న ప్రతిపక్షాల ఆరోపణలను మమత తోసిపుచ్చారు. “ఇక్కడ పోలీసులు చట్ట ప్రకారం నడుచుకుంటారు. ఇది మధ్యప్రదేశ్ లేదా ఉత్తరప్రదేశ్ కాదు’ అని మమత అన్నారు.
Park Street rape was a dispute between the client (read rapists) & the service provider (read victim) #Hanskhali – the boy (read rapist cum murderer) & the girl (read victim) were in a love affair
Lesser evil indeed. #MamataBanerjee #TMC
SHE has one of the filthiest minds https://t.co/jROJJbc1pf
— Sanjukta Choudhury (@SanjuktaChoudh5) April 11, 2022