ఆస్ట్రేలియాలో మోదీకి అరుదైన అపురూప స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కమ్యూనిటీ ఈవెంట్ కు ఆయన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ తో హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సిడ్నీలో మోదీకి వినూత్న రీతిలో స్వాగతం పలికారు అక్కడివారు. కాంట్రయిల్ లతో ఆకాశంలో వెల్కం మోదీ అంటూ అక్షరాలు దిద్దడం ఆకట్టుకుంది.ఈ స్కై రైటింగ్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://twitter.com/mvmeet/status/1660906204464549889?s=20