2001 లో ఆఫ్ఘన్ యుద్దం మొదలైనప్పటి నుండి, 450 మంది బ్రిటిష్ సైనికులు చనిపోయారు. బ్రిటన్ షుమారు 30 బిల్లియన్ల పౌండ్లు ఈ యుద్దం పై ఖర్చు చేసింది. 2014 లో బ్రిటిష్ సైన్యం ఆఫ్ఘన్ నెలని వదిలి వేసింది. అమెరికా హఠాత్తు నిర్ణయం తో NATO సభ్యదేశంగా అమెరికా బాట నడవాల్సిన పరిస్తితి బ్రిటన్ కు తప్పలేదు.
అలాగే రష్యా, చైనా లు కూడా తాలిబాన్ తో కలసి పని చేయటంతో బ్రిటన్ కూడా వారి పంచన చేరింది. ఆఫ్గనిస్తాన్ సంక్షోభానికి పరిష్కారం చూపడంలో అవసరమైతే తాలిబన్లతో కలిసి పనిచేస్తామని ఆ దేశ ప్రధాని బోరిస్ ప్రకటించారు. అటు ఇప్పటివరకు 1,615 మందిని ఆఫ్గనిస్తాన్ నుంచి బ్రిటన్ తరలించామని వారిలో 399మంది బ్రిటన్ జాతీయులుండగా..402 మంది అఫ్గన్లు, మిగిలినవారు అక్కడి తమ రాయబార కార్యాలయ సిబ్బంది అని బోరిస్ తెలిపారు. తాలిబన్ల పాలనను గుర్తించబోమని అనేక ప్రపంచదేశాలంటుంటే బ్రిటన్ వారితో కలిసి పనిచేస్తాననడం చర్చనీయాంశమైంది.
బ్రిటన్ హోమ్ సెక్రెటరీ ప్రీతి పటేల్ 20,000 ఆఫ్ఘన్లకు 5 సంవత్సరాల పునరావాస పథకాన్ని ప్రకటించారు. బ్రిటన్ పార్లమెంటు లో దీనిపై తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తమయ్యాయి. ఒకప్పుడు ప్రపంచ రాజకీయాలని శాసించిన బ్రిటన్ ఇప్పుడు చిన్న సైన్యం తో పోరాడే తాలిబాన్ తో కలసి పనిచేయాల్సి రావటం , ఎవరైతే ఆఫ్ఘన్ నేలపై యుద్దాలు చేస్తారో వారి అపజయం తప్పదు అన్నదానికి ఈ తాజా సంఘటన మరొక్క ఉదాహరణ.