భారత స్వాతంత్ర్య దినోత్సవాలను బహిష్కరిస్తామని రైతు ఉద్యమకారులు మరోసారి కేంద్రాన్ని హెచ్చరించారు. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆగస్టు 15న ఢిల్లీలో పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికైట్ అన్నారు. గతంలోలాగా వేలాదిగా రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీ తరలివస్తారన్నారు. ట్రాక్టర్లతో ప్రదర్శన తప్పేం కాదన్న ఆయన… వాటిపై త్రివర్ణపతాకాలను ఎగురవేస్తామన్నారు. ఆందోళనపై కిసాన్ జేఏసీ ఏ నిర్ణయం తీసుకోబోతున్నదనేది మాత్రం తమకు తెలియదన్నారు.
హర్యానాలోని జింద్ ప్రజలు ఇంకా ఆగ్రహంగానే ఉన్నారని రాకేశ్ అన్నారు. రాష్ర్టంలో మంత్రులు ఆ రోజులు జెండా ఎగురవేసినట్టుగానే…రైతులు ట్రాక్టర్లపై జెండా ఎగురవేసి నిరసన తెలుపుతారన్నారు,. మొరాదాబాద్, హాపూర్, ఆమ్రోహానుంచి పెద్దసంఖ్యలో రైతులు అవే ట్రాక్టర్లపై డిల్లీ చేరుకుంటారని ఆయన కార్యాచరణ ప్రకటించారు.
మొన్నటి గణతంత్ర వేడుకల సందర్భంగా రైతులప్రదర్శన ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసింది. ఆ నిరసనలో అసాంఘిక శక్తులు ప్రవేశించినట్టు విమర్శలు వచ్చాయి. ఎర్రకోట మీద జాతీయ జెండా స్థానంలో ఖలిస్థాన్ వేర్పాటువాద జెండా ఎగురవేసిన సంగతి తెలిసింది. రైతుల్లా వచ్చిన ఆందోళన కారులు బారికేడ్లు తొలగించుకుని వెళ్లి విధ్వంసం రేపారు. పోలీసులమీదా కత్తులతో, ఇతర ఆయుధాలతో దాడి చేశారు కూడా.