మదర్సాలు కేంద్రం ఉగ్రకార్యకలాపాలు సాగిస్తే ఊరుకునేది లేదన్నారు అసోం సీఎం హిమంతబిశ్వాశర్మ. అన్ని మదర్సాలను కూల్చేయడం తమ ఉద్దేశం కాదన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థలతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలున్న ఓ మదర్సాను ప్రభుత్వం బుల్డోజర్లతో నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. మదర్సాలను జీహాదీ శక్తులు వాడుకోకుండా చూడడమే తమ ఉద్దేశమని ఈ సందర్భంగా హిమంత అన్నారు. మదర్సా ముసుగులో ఎలాంటి దేశవ్యతిరేక కార్యకలాపాలు జరిగినా కూల్చేస్తామని ఆ కుట్రల్ని భగ్నం చేస్తామనీ అన్నారు.
బొంగైగావ్ జిల్లాలో ఓ మదరసాలో జీహాదీ కార్యకలాపాలు జరుగుతున్నట్లు, అలాగే భవనాన్నినిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్టు తేలడంతో అధికారులు కూల్చేశారు. ఈ మదరసాకు అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు తేలిందని అధికారులు తెలిపారు. అల్‌ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్, అన్సరుల్ బంగ్లా టీమ్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలుగల ఐదుగురిని ఈ మదరసాలో అరెస్ట్ చేశారు కూడా.