అయోధ్య, వారణాశి తరహాలో పశ్చిమ యూపీలోని మధుర బృందావన్లో అద్భుతమైన ఆలయం నిర్మిస్తామని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. అందుకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.
ఆమ్రోహాలో జరిగిన బహిరంగసభ వేదిగ్గా ఆయనీ మాటన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంవైపు అడుగులేయడం ద్వారా బీజేపీ తన నిబద్దతను నిరూపించుకున్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని మేం హామీ ఇచ్చాం, మోదీజీ ఆ పనులు ప్రారంభించారు. కాశీలో నిర్మించిన అద్భుతమైన కారిడార్ చూశారు కదా..మరి మధుర బృందావన్ ఆలయాన్ని అలాగే ఎందుకు వదిలేస్తాం? అక్కడా పనులు పురోగతిలో ఉన్నాయి అని అన్నారు.
మథురలోని షాహీ ఈద్గా దగ్గర కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని అఖిలభారత హిందూమహాసభ ప్రకటించిన సంగతి తెలిసిందే. మధురలో ఆలయ నిర్మాణానికి సన్నాహాలు మొదలయ్యాయని డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా ట్వీట్ చేశారు.