సీఎం కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ, సుదీర్ఘ చర్చల నేపథ్యంలో తెలంగాణ పీసీసీ సారధి రేవంత్ రెడ్డి సహా సీనియర్లు స్పందించారు. టీఆర్ఎస్ కు ప్రశాంత్ కిషోర్ కు అసలు సంబంధమే లేదని..తెగదెంపుల కోసమే ఆయన కేసీఆర్ ను కలిశారని రేవంత్ అన్నారు. ప్రశాంత్ కిషోర్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని.. తామిద్దరం కలిసి ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్టు రేవంత్ అన్నారు. పీకే కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత పార్టీ హైకమాండ్ మాటనే ఫైనల్ అవుతుందని రేవంత్ అన్నారు. ఇక పీకే విషయంలో తుదినిర్ణయం సోనియాదేనని పార్టీ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైమాండ్ కమిటీ వేసిందని, నివేదిక తరువాత నిర్ణయం ఉంటుందని చెప్పారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు అంటూ కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అటు మల్లురవి సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ రహస్య ఒప్పందం మేరకు పనిచేస్తూ తమ పార్టీపై బురదజల్లుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మల్లురవి.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)