హైదరాబాద్ దాటి విస్తరిస్తున్న ఎంఐఎం పార్టీ…త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ మీద కన్నేసింది. పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అప్పుడే ఎన్నికలప్రచారం మొదలుపెట్టారు. బీఎస్పీ, ఎస్పీ అధినేతలు మాయావతి, అఖిలేష్ ను టార్గెట్ చేశారు. వారిద్దరివల్లే నరేంద్రమోదీ రెండు సార్లుప్రధాని అయ్యారని ఆరోపించారు. అసదుద్దీన్ కారణంగానే తమ పార్టీ ఓట్లు చీలిపోతున్నాయని చెబుతూ… ఓట్ స్పాయిలర్‌గా తనను వారు అభివర్ణించడంపై అసద్ మండిపడ్డారు. యూపీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయడం వల్లే బీజేపీ గెలిచిందన్న వ్యాఖ్యల్నీ ఖండించారు.
ముస్లిం ప్రయోజనాల్ని కాపాడేందుకే దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తోందని అసద్ అన్నారు. 2019 ఎన్నికల్లో హైదరాబాద్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీహార్‌లోని కిషన్‌గంజ్‌లోని మూడు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించిందన్నారు. మోదీ, అమిత్ షాలు హైదరాబాద్‌లో పలు పర్యటనలు చేసినప్పటికీ..బీజేపీ ఓడించగలిగామన్నారు. యూపీలో ఉన్న ముస్లింలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని వారి అభివృద్ధికి కృషిచేస్తామని అన్నారు. గతంలో ఎస్పీ, బీఎస్పీలకు ఓట్లేసిన ముస్లింలు..ఇప్పడు తమ శక్తేంటో చూపించాలని అసద్ పిలుపునిచ్చారు.