అమెరికా కొత్త ప్రభుత్వం దూకుడుని తాము ఎదుర్కొంటామని భారతదేశం ప్రకటించింది. ఇటీవల కొన్ని దేశాల ఉత్పత్తులు మీద అమెరికా ఆంక్షలు విధించింది. భారతదేశానికి సైతం ఇటువంటి ప్రమాదం ఉంటుందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
అంతటి విపత్కర పరిస్థితి ఏర్పడదు అని భారత్ అంచనా వేస్తోంది. ఒకవేళ అమెరికా దూకుడుగా వ్యవహరించిన తామసిద్దమే అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు.
అమెరికా ఆంక్షలు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
కెనడా, మెక్సికో నుంచి దిగుమతులపై 25 శాతం, చైనా నుంచి వచ్చే వస్తువులపై 10 శాతం సుంకం విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దేశంలో తయారీని పెంచడానికి, ఫెడరల్ ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచేందుకు ఈ సుంకాలను ఉపయోగిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.
మెక్సికో, కెనడా దిగుమతులపై 25 శాతం (కెనడియన్ ఎనర్జీపై 10 శాతం), చైనాపై 10 శాతం అదనపు సుంకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఫెంటానిల్ సహా మన దేశంలోకి వస్తున్న అక్రమ విదేశీయులు, ప్రాణాంతక మాదకద్రవ్యాలను అరికట్టేందుకు అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం ద్వారా ఈ సుంకాలు విధించానని తెలిపారు.
అమెరికన్లను రక్షించాల్సిన అవసరం ఉన్నదని, అందరి భద్రతను నిర్ధారించడం అధ్యక్షుడిగా తన కర్తవ్యమని వెల్లడించారు. సరిహద్దు వెంబడి సంక్షోభం తగ్గే వరకు సుంకాలు అమలు చేస్తామని తెలిపారు. కాగా, ఈ సుంకాలను మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.
ఈ నేపథ్యంలో రవాణాలో ఉన్న వస్తువులు, కటాఫ్ సమయానికి ముందే అమెరికా సరిహద్దుల్లోకి వచ్చే వారికి సుంకాల నుంచి మినహాయింపు ఉందనుంది. ట్రంప్ నిర్ణయంతో అమెరికా వృద్ధి తగ్గడమే కాకుండా, కెనడా, మెక్సికో దేశాల్లో ఆర్థిక మాంద్యం ఏర్పడే ముప్పు పొంచిఉన్నది. అదేవిధంగా ఉత్తర అమెరికాపై ప్రభావం చూపనుంది.
మొత్తం మీద అమెరికా ఆంక్షలు అంశం పై కేంద్ర ప్రభుత్వం సమీక్ష జరిపింది. తగిన పరిస్థితుల మీద అంచనా రూపొందించుకుంటుంది