పంజాబ్ లో అమరీందర్ సింగ్ కొత్తపార్టీ ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’, బీజేపీ పొత్తుఖరారైంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలూ కలిసిపోటీచేయనున్నాయి.
పంజాబ్ బీజేపీ ఇంచార్జ్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సమావేశమైన తర్వాత కెప్టెన్ ఈ విషయాన్ని ప్రకటించారు. తమ పొత్తు ఖాయమైంది, సీట్ల సర్దుబాటు పై చర్చలుకొనసాగుతున్నాయనీ అన్నారు. గెలుపే లక్ష్యంగా కూటమి బరిలో దిగుతుందని కెప్టెన్ అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలతో పాటు పంజాబ్‌లో ఎన్నికలు జరగనున్నాయి.
ఇటీవలే కాంగ్రెస్ అధిష్టానంతో విభేదించిన అమరీందర్…తన సీఎం పదవికి, పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.