ప్రముఖ పుణ్యక్షేత్రం వర్గల్ లో అపచారం చోటు చేసుకొంది. పురాతన వేణుగోపాల్ స్వామి ఆలయంలోకి మొహర్రం ఊరేగింపు తీసుకొని వచ్చేసి అపచారానికి పాల్పడ్డారు. దీంతో అక్కడ హిందూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
….
వర్గల్ లో ని సరస్వతీ దేవి ఆలయం అందరికీ చిరపరిచితం. అక్కడ కొలువైన సరస్వతీ దేవి పిల్లలకు విద్యాబుద్దులు ప్రసాదిస్తుందని నమ్మకం. అందుకు తగినట్లుగా మన తెలంగాణ లోని వివిధ జిల్లాల నుంచి భక్తులు ఇక్కడకు తరలి వస్తుంటారు. పిల్లల చేత పూజలు చేయించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొంటూ ఉంటారు.వర్గల్ సరస్వతీ దేవి ఆలయానికి కూత వేటు దూరంలోనే వేణుగోపాల స్వామి ఆలయం కొలువై ఉంది.
….
800 సంవత్సరాల క్రితమే నిర్మించిన పురాతన దేవాలయం ఇది. ఇటీవల కాలంలో గ్రామంలోని భక్తులంతా కలిసి దీనిని పునర్ నిర్మించుకొన్నారు. అప్పటి నుంచి ఆలయంలో విశేషంగా పూజాదికాలు నిర్వహిస్తూ భక్తులు తమ భక్తిని చాటుకొంటున్నారు. ఇక్కడ స్వామివారిని”రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి” గా పిలుస్తారు. ఆలయం వార్గల్ విద్యా సరస్వతి ఆలయానికి చాలా దగ్గరగా ఉంది. ఆలయంలో చాలా విచిత్రమైన రాతి ధ్వజస్తంభంపై హనుమంతుడు మరియు గరుడుడి పురాతన శిల్పాలు ఉన్నాయి. విద్యా సరస్వతి ఆలయం నుండి కూడా రాతి ధ్వజస్తంభం కనిపించింది. ఆలయంలో ధ్వజస్తంభానికి సమీపంలో నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ సంతాన వేణుగోపాల స్వామివారిని అర్చిస్తే సంతానం కలుగుతుందన్న నమ్మకంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి పూజలు చేయించుకొంటూ ఉంటారు.
..
కానీ ఆదివారం రోజు రాత్రి కొంతమంది మొహర్రం ఊరేగింపుతో నేరుగా వేణుగోపాల స్వామి ఆలయంలోకి వచ్చేశారు. అక్కడ గడబిడకు దిగటంతో భక్తులంతా భయాందోళనలకు గురి అయ్యారు. ముస్లింలకు సంబంధించిన మొహర్రం ఊరేగింపును నేరుగా హిందూ దేవాలయంలోకి తీసుకొని రావటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నకుట్రలో భాగమేనని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. భక్తుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు వర్గాలకు నచ్చచెప్పి అక్కడ నుంచి పంపించివేసి, పరిస్థితిని చక్కదిద్దారు.