దేశంలో ఎక్కడైనా భూమి కనబడితే పంజా విసిరి ,, లాగేసుకునే అధికారం వక్ఫ్ బోర్డులకు ఉంది. సెక్యులర్ ముసుగులో రాజకీయ పార్టీలు ఈ అధికారానికి జేజేలు పలుకుతున్నాయి. నిన్న మొన్నటిదాకా క్రైస్తవ చర్చిలు కూడా అదే బాటలో నడిచాయి. వక్ఫ్ బోర్డు అధికారాన్ని సవరించడం అంటే.. మైనారిటీల హక్కుల్ని హరించి వేయడమే అని గగ్గోలు పెట్టేసారు.
కానీ ఇప్పుడు క్రైస్తవ చర్చిలకు కూడా వక్ఫ్ బోర్డు సెగ తగులుతుంది. కేరళలోని కొన్ని చర్చిలకు వక్ఫ్ బోర్డు నోటీసులు ఇచ్చింది, చర్చిలకు సంబంధించిన ఆస్తులు తమవే అని.. వెంటనే వాటిని ఇచ్చివేయాలని డిమాండ్ చేస్తున్నది. మునంబం పట్టణం లోని చర్చి భూమి తమదే అని స్థానిక వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎం.కె. సకీర్ తేల్చి చెప్పారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేశారు.
ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఏదైనా భూమి తమదే అని వక్ఫ్ బోర్డు ఒక నోటిఫికేషన్ జారీ చేస్తే,, ఇకనుంచి ఆ భూమి మొత్తం వక్ఫ్ బోర్డుకి చేరిపోతుంది. ఇప్పుడు ఈ చర్చి భూమిని కూడా అలా ఇచ్చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం ఏర్పాట్లు మొదలుపెట్టింది. కానీ , కేరళ సమాజంలో క్రైస్తవ చర్చిల నెట్వర్క్ బలంగా ఉంటుంది. ప్రధాన చర్చిలకు సంబంధించిన బిషప్ లు రంగంలోకి దిగి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. భూముల స్వాధీనాన్ని ఆపి వేయించారు.
దీంతో వక్ఫ్ బోర్డ్ బాధ ఏమిటో క్రైస్తవ సమాజానికి కూడా తెలిసి వస్తోంది