అక్షరాల తొమ్మిది లక్షల ఎకరాలు కలిగి ఉన్న ధనిక సంస్థ వక్ఫ్ బోర్డు. అయినప్పటికీ ఈ వక్సు కు ఆస్తుల దాహం తీరడం లేదు. నిన్న మొన్నటిదాకా గ్రామాల్లోని రైతుల భూములు లాగేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా దేవుడి భూములను కూడా లాగేసుకుంటుంటే ప్రభుత్వం యంత్రాంగం కళ్ళు మూసుకుని కూర్చోంది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లోఅక్షరాల 40 ఎకరాల దేవాలయం భూమిని వక్ఫ్ బోర్డు లాగేసుకుంది.
ప్రస్తుతం ఉన్న వక్ఫ్ బోర్డు చట్టం ప్రకారం.. దేశంలోని ఏ భూమి ని అయినా వక్ఫ్ బోర్డు లాగేసుకోవచ్చూ. ఒక నోటిఫికేషన్ విడుదల చేసి, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి కేవలం ఒక లెటర్ రాసి, వెంటనే ఆ భూమిలో బోర్డు పెట్టేసుకుంటారు. అంతటితో ఆ భూమి వక్ఫ్ బోర్డు కు చెందినదిగా ప్రకటించడం జరుగుతుంది. అప్పుడు ఆ భూమి యజమానులు నెత్తి నోరు కొట్టుకుని కోర్టుల చుట్టూ తిరిగి భూమి ని విడిపించుకోవాలి. సంవత్సరాలు తరబడి తిరిగాక అదృష్టం బాగుంటే భూమి వస్తుంది, లేదంటే అంతే సంగతులు.
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో కూడా ఇదే రిపీట్ అయింది. ఈసారి ఏకంగా పరమేశ్వరుడి దేవాలయం భూములకి ఎసరు పెట్టేసారు. అక్షరాల 40 ఎకరాల భూమి తమది అంటూ ఒక బోర్డు పెట్టేసి, వక్ఫ్ సంస్థ భూమిని లాగేసుకుంది. దీనిమీద ఆలయ ట్రస్టీలు నెత్తీ నోరు బాదుకుంటున్నారు. బ్రిటిష్ పరిపాలన కన్నా ముందుగానే ఈ భూమిని స్థానిక ఆలయ సంరక్షకులు శంకర్ భాయ్ కుటుంబానికి అప్పగించడం జరిగిందని, దీనిమీద బ్రిటిష్ కాలంలోనూ ఆ తర్వాత రెవెన్యూ రికార్డుల్లో కూడా స్పష్టంగా ఉందని చెబుతున్నారు. స్థానిక రాహూరి జిల్లా కోర్టు కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేసిందని వివరిస్తున్నారు. అయినప్పటికీ రాత్రికి రాత్రి వక్ఫ్ బోర్డు ఈ భూమిని లాగేసుకుంది.
మొన్నటికి మొన్న కర్ణాటకలోని విజయపురా గ్రామంలో 1200 ఎకరాల భూమిని వక్ఫ్ బోర్డు.. కేవలం ఒక నోటిఫికేషన్ విడుదల చేసి లాగేసుకుంది. ఇంకా దేశవ్యాప్తంగా ఎన్ని వేల ఎకరాలు మాయం అవుతాయో భవిష్యత్తులో వేచి చూడాలి. ఈ దారుణాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొంత ప్రయత్నం చేసింది. వక్ఫ్ చట్టానికి సవరణలు చేసేందుకు ప్రయత్నిస్తే కొన్ని ప్రతిపక్ష పార్టీలు బ్రేకులు వేశాయి. దీని మీద ప్రజల నుంచి ఒత్తిడి వస్తే తప్ప,, ఈ దారుణాలకు అడ్డుకట్ట పడదు.