వక్ఫ్ బోర్డు సవరణల దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. పార్లమెంటరీ స్థాయి సంఘం దీనికి ఆమోదం తెలియజేసింది పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించ పొందడమే తరువాయి.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వక్ఫ్ బోర్డు చట్టం ప్రకారం చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి. ఏదైనా నిర్దిష్టమైన భూభాగం తమదే అని బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసినట్లయితే.. ఆ భూభాగం అంతా బోర్డుకి అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతోపాటు బోర్డు పాలకమండలి నిర్మాణంలో కూడా చాలా అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు ప్రతిపాదించింది.
ఈ సవరణలను పార్లమెంటులో ప్రవేశ పెట్టినప్పుడు కొంత అంతరాయం కలిగింది దీనిమీద అధ్యయనం కోసం పార్లమెంటరీ సంయుక్త సంఘానికి అప్పగించారు.వక్ఫ్ సవరణ బిల్లుకు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన ప్యానెల్‌కు బీజేపీ ఎంపీ జగదాంబి పాల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన అధ్యక్షతన జేపీసీ కమిటీ సమావేశమైంది. విపక్ష ఎంపీలు సహా ఇతరులు మొత్తంగా 44 మార్పులు సూచించగా.. 14 సవరణలను కమిటీ ఆమోదించినట్లు ప్యానెల్ ఛైర్మన్ జగదాంబిక పాల్ వెల్లడించారు. ఈ సవరణలు చట్టాన్ని మరింత శక్తివంతంగా మారుస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, ఈ 14 ప్రతిపాదనల ఆమోదానికి సంబంధించి జనవరి 29న ఓటింగ్ జరగనుంది. జనవరి 31న తుది నివేదిక లోక్‌సభకు అందజేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఈ రెండు రోజుల్లోనే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లుని మరోసారి ప్రవేశపెట్టే
                                                                    



