మసీదులు, దర్గాలు ఉపయోగించే లౌడ్‌స్పీకర్లపై కర్ణాటక రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఆంక్షలు విధించింది. ఇకపై రాత్రి 10.00 గంటల నుంచి ఉదయం 6.00 గంటల వరకు లౌడ్స్పీకర్లను వినియోగించవద్దని సర్క్యులర్ జారీ చేసింది. ఇలా రాత్రి సమయంలో ఉపయోగించడం వల్ల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజల ఆరోగ్యం, మానసిక స్థితికి ఇబ్బందిగా మారుతుందని పేర్కొంది. పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 ప్రకారం సైలెన్స్ జోన్లలో.. పెద్ద ఎత్తున శబ్ధం కలిగించే టపాకాయలు, డీజే సౌండ్ సిస్టమ్, లౌడ్ స్పీకర్లు వినియోగించే వారిపై జరిమానా విధించే అవకాశం ఉందని కర్ణాటక రాష్ట్ర వక్ఫ్‌బోర్డు విడుదల చేసిన సర్క్యులర్‌లో హెచ్చరించింది.