ఎయిర్ చీఫ్ స్టాఫ్ గా వివేక్ రామ్ చౌదరిని నియమించింది కేంద్రం. ప్రస్తుతం ఐఏఎఫ్ చీఫ్‌గా కొనసాగుతున్న రాకేశ్‌కుమార్ సింగ్ భదౌరియా ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. చౌదరి ఈ ఏడాది జూలై 1న డెప్యూటీ ఎయిర్ చీఫ్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 38ఏళ్ల కెరీర్లో భారత వైమానిక దళానికి చెందిన రకరకాల ఫైటర్, ట్రైనర్ విమానాలను నడిపారు.సున్నితమైన లడఖ్ ప్రాంతంలో దేశ గగనతలాన్ని రక్షించే బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారు చౌదరి. నేషనల్ డిఫెన్స్అకాడమీ, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ, వెల్లింగ్టన్ పూర్వ విద్యార్థి వీఆర్ చౌదరి.
మిగ్ -21, మిగ్ -23 ఎంఎఫ్, మిగ్ -29, సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో 3,800 గంటలు ప్రయాణించిన అనుభవం ఆయనకు ఉంది.