ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బైంసా పట్టణంలో మానవత్వం పరిమళించింది. అనాధ అవ్వ మృతదేహానికి స్వచ్ఛందంగా అంత్యక్రియలు నిర్వహించారు. హైందవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపి, ఒక మంచి పని నిర్వహించారు.
……..
మూడు నెలల క్రితం బాసర .. గంగమ్మ నిలయంలో, నడవలేని ఓ వృద్ధురాలిని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లారు. సొంత పిల్లలే రోడ్డున వదిలేయడంతో అవ్వ మౌనంగా రోదించింది.
సమాచారం అందుకున్న ఐక్యత సేవ సమితి కార్యకర్తలు అక్కడికి వెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం అందించారు.
హాస్పిటల్ లో వైద్యం చేయిస్తూ,, రోజువారి ఆహారం అందిస్తూ.. ఆమె బాగోగులు చూస్తూ వచ్చారు. మూడు నెలలుగా ఆమె బాధ్యతలు అన్నీ.. ఐక్యత సేవ సమితి కార్యకర్తలు నిర్వహించారు. అయినప్పటికీ నిర్ధాక్షిణ్యంగా వదిలేసిన కొడుకు కూతుళ్ళ గురించి ఆ ముసలి అవ్వ ఒక్క మాట కూడా అనకుండా మౌనంగా బాధను గుండెల్లో దాచుకుంది. ఆ బాధతోని హాస్పిటల్లో ఆమె తనువు చాలించింది.
తాను చనిపోతే తల కొరివి మీరే పెట్టాలన్న వృద్ధురాలి కోరిక మేరకు.. ఐక్యత సేవ సమితి దహన సంస్కారాలు నిర్వహించింది.
ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఐక్యత సేవ సమితి బృందాన్ని పలువురు అభినందించారు.
…….
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకలాపాల్లో పాలుపంచుకునే స్వయంసేవకు లు ఈ సమితి నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సంఘ్ భావాలు జాతీయ ఆలోచనలతో ఈ కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఈ సమితి సేవలను అంతా అభినందిస్తున్నారు