స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన” స్వ”ఇంకా పూర్తిగా రాలేదు అనటానికి ఒక ఉదాహరణ కాలగణన. మన దైనందిన జీవితం ఆంగ్ల కాలగణనతోనే సాగిపోతోంది, దేశానికీ సంబంధించిన కొన్ని సందర్భాలు ఆంగ్ల కాలగణనతోనే సాగుతున్నాయి., అయినా మన పండుగలు, పుణ్య కార్యక్రమాలు , మన పుట్టినరోజు పండుగలు, అలాగే అనేకమంది మహాపురుషుల జయంతిలు భారతీయ కాలగణన ప్రకారం జరుపుకుంటాం, అలా వివేకానంద జయంతి కూడా జరుపుకోవటంపై అందరం ఆలోచిస్తే బాగుంటుంది.
స్వామి వివేకానందుడు కలియుగాబ్ది 4964 శుభ దుందుభి నామ సంవత్సరం పుష్య మాసం బహుళ సప్తమి సోమవారం నాడు జన్మించాడు…. ఆ రోజున మకర సంక్రాంతి .. పాశ్చాత్య కాలమానం ప్రకారం అది 1863 జనవరి 12.. ఈ ప్లవనామ సంవత్సరం పుష్య బహుళ సప్తమి అంటే 2022 జనవరి 24వ తేదీ సోమవారం నాడు వస్తోంది, కాబట్టి మన కాలగణన ప్రకారం వివేకానంద జయంతి ఈ సారి జనవరి 24న జరుపుకోవాలి కానీ ఆంగ్ల కాలమానం ప్రకారం జనవరి 12 న వివేకానంద జయంతి రోజు దశాబ్దాలుగా యువజనోత్సవాలు జరుగుతున్నయి, అది వాడుకలోకి రావాలంటే సమయం పడుతుంది, దానికి ఎక్కడో మొదలు కావాలి. ఈ విషయాన్ని అందరం ఆలోచిద్దాము. కనీసం ఈ జనవరి 24 వివేకానంద జయంతి రోజు వారి జీవన ప్రేరణను స్మరించుకొందామా ?
Courtesy :- Bharatiyam