కశ్మీర్ హిందువుల తరిమివేత, పండితుల ఊచకోత నేపథ్యంగా తీసిన ది కశ్మీర్ ఫైల్ మూవీపై మరోసారి మండిపడ్డారు ఆ రాష్ట్ర మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా. ఆయితే అంతే ఘాటుగా బదులిచ్చాడు సినీదర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.
ఇటీవల పండిట్లను ఉగ్రవాదులు మళ్లీ లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో అందుకు కారణం కశ్మీర్ ఫైల్ సినిమానే అనే అర్థం వచ్చేలా ఆరోపణలు చేశారు అబ్దుల్లా. ఆ సినిమా ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఉందని.. ఇలాంటి సినిమాలు, మీడియాను నిషేధించాలని ఈ విషయమై లెఫ్టినెంట్ గవర్నర్ తో మాట్లాడుతానని ఆయన అన్నారు. అయితే ఫరూఖ్ మాటలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు ట్విట్టర్ వేదిగ్గా వివేక్.
ఆయన వీడియోను జతచేస్తూ ‘అవును ఫరూఖ్ జీ మా సినిమా వల్లే లోయలో అమాయక ప్రజలు మాటలు నేర్చుకున్నారు. మా సినిమానే లేకపోతే కశ్మీర్లో హిందువులపై దాడులు, ఊచకోత జరిగేవే కాదు. అసలు మా సినిమా చూసే రవిల్, గలివ్, జలివ్ అంటూ సాటి మనుషులను తరిమివేశారు. అసలు మా సినిమా వల్లే కశ్మీర్లో పాక్ జెండా ఎగిరింది’ అని ట్వీట్ చేశారు వివేక్ అగ్నిహోత్రి.
https://twitter.com/vivekagnihotri/status/1526220167931277312?s=20&t=0OtYbO6GnE6fPrgnA9Yt3Q