పొరుగు దేశం బంగ్లాదేశ్ లోని పరిస్థితుల్లో అందరికీ ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వ మార్పిడి పేరుతో సాగిస్తున్న అల్లర్లు.. మనుషుల్ని నడిరోడ్డు మీద చంపేయడం దాకా దారి తీస్తున్నాయి. ముఖ్యంగా షేక్ హసీనా అనుచరులను మద్దతుదారులను చంపేస్తున్నామంటూ చెప్పి మరి హత్యలకు దిగుతున్నారు. కానీ ఈ వంకతో భారత్ మూలాలు ఉన్న ప్రజానీకాన్ని టార్గెట్ చేయడం ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటిదాకా జరిగిన అల్లర్లలో వందల మంది హిందువులు చనిపోయారు అని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి లెక్కలు రికార్డులు అధికారికంగా వెలువడటం లేదు కానీ వాస్తవాలు మాత్రం చేదుగానే ఉంటున్నాయి. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసి, భారత్ కి చేరుకున్న తర్వాత హిందువులపై ఇస్లామిక్ ఛాందసవాదులు రెచ్చిపోయి, అడ్డూ అదుపు లేకుండా దాడులకు దిగుతున్నారు. ఇస్లామిక్ మూకలు హిందువుల ఇళ్లపై దాడి చేసి, తగలబెడుతున్నారు. దీంతో తమ ప్రాణాలను కాపాడుకోవడానికి హిందువులు పరుగెత్తి, దాక్కోవాల్సిన పరిస్థితి దాపురించింది. హిందువులను కాపాడడానికి అక్కడ ఎలాంటి వ్యవస్థలూ లేకపోవడం అత్యంత శోచనీయం. మరోవైపు బంగ్లాదేశ్ లోని నారాయణ గంజ్ లోని ఓ హిందువుల నివాసంపై 400 మంది ఇస్లామిక్ ఛాందసుల దాడి చేసి, ఇంటిని దోచుకున్నారు. ఆ తర్వాత ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు.
తమ ప్రాణాలను కాపాడుకోవడానికి మఖన్ సర్కార్ అనే వ్యక్తి కుటుంబంతో సహా ఇతర ప్రాంతానికి పారిపోయారు. ప్రస్తుతం ఓ చోట దాక్కున్నారు. కానీ.. అతనికి ఎలాంటి సహాయమూ అందడం లేదు. ఆర్మీ అయినా.. పోలీసులు అయినా రక్షించారు. ఈ ఇద్దరూ హిందువులకు ఎలాంటి సహాయమూ చేయడం లేదు.
బంగ్లాలో హిందువులను సెలెక్ట్ చేసి మరీ హింసిస్తున్నారు. రాత్రులంతా ఇస్లామిక్ ఛాందసులు హిందువులను హింసిస్తూనే వున్నారు. హిందు మహిళల్ని హింసించడమే కాకుండా.. అపహరించుకుపోతున్నారు కూడా. బంగ్లాలోని హిందువులు తీవ్ర భయాందోళనల్లో వున్నారని దీనిని బట్టి అర్థమైపోతోంది. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రవాదులు తుపాకులతో వీధుల్లో తిరుగుతున్నారు. దీంతో హిందువులు తీవ్ర భయాందోళనల్లో వున్నారు. ఇలా తిరుగుతున్నందున హిందువులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారు. వీటన్నింటితో పాటు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుందామంటే ఇంటర్నెట్ సేవలు, మొబైల్ సేవలను అడపా దడపా నిలిపేస్తున్నారు.
కావాలనే, ఉద్దేశపూర్వకంగానే ఇస్లామిక్ ఛాందసులు హిందువులైన తమల్ని టార్గెట్ చేసుకున్నారని, ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్న కుట్రలని అక్కడి హిందువులు పేర్కొంటున్నారు. ప్రముఖ బంగ్లాదేశ్ గాయకుడు రాహుల్ ఆనంద్ ఇంటిని కూడా కాల్చేశారు. దాదాపు 3000 సంగీత వాయిద్యాలు అగ్నికి ఆహుతయ్యాయి.
మొత్తం మీద బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడులు అందరికీ ఆందోళన కలిగిస్తున్నాయి. దీని వెనుక కచ్చితంగా కుట్ర దాగి ఉంది అన్న మాట స్పష్టం అవుతోంది.